KCR Tremendous Veiw In Leading The Third Front

2018-03-05 4

Telangana Chief Minister K Chandrashekhar Rao, whose call for a qualitative change in national politics drew tremendous response, on Monday announced that he was ready to take on the mantle of leading a political front, and that he would be chalking out a programme to hold a series of meetings at the all India level with various organizations, associations and individuals soon.

కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఏర్పడబోయే థర్డ్ ఫ్రంట్‌కు నాయకత్వం వహించే సత్తా తెలంగాణ సీఎం కేసీఆర్‌కే వంద శాతం ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి సమయంలో తెలుగు వారంతా కేసీఆర్‌కు అండగా నిలవాలన్నారు. ఆనాడు ఎన్టీఆర్ తెలుగువాణిని ఢిల్లీలో ఎలుగెత్తి చాటారని, ఇప్పుడు కేసీఆర్ మళ్లీ అదే చేయబోతున్నారని పేర్కొన్నారు. వామపక్షాలు కూడా తమ అభిప్రాయ భేదాలు పక్కన పెట్టి తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.కేంద్రం తెలంగాణపై ఓ రకమైన వివక్ష, ఏపీపై మరో రకమైన వివక్ష చూపుతోందన్నారు.

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ అవినీతి, అక్రమాలలో కూరుకుపోతే, బీజేపీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని, పేద ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఆరోపించారు.

క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం, వ్యవస్థలో లోపాలను ప్రధాని మోడీ గుర్తించడం లేదన్నారు. ఆర్థిక నేరగాళ్లను అదుపు చేయడంతో ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. ఈ పరిస్థితి పోయి ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్‌, బీజేపీయేతర పార్టీలతో థర్డ్‌ ఫ్రంట్‌ రావాలని ఆకాంక్షించారు.

Free Traffic Exchange