NTR Trivikram Movie New Twist గాసిప్ నిజమైంది, త్రివిక్రమ్ ఆఫర్ కి నో !

2018-03-05 6

Junior NTR and Trivikram Srinivas's latest project set to start shooting for their upcoming movie soon. Trivikram Srinivas offered a role to actress Laya, which she rejected


అజ్ఞాతవాసి చేదు అనుభవం తర్వాత యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ సినిమాను పట్టాలెక్కించేందుకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సిద్ధమయ్యాడు. ఈ చిత్రంలో డీజేలో బికినీ అందాలతో అదరగొట్టిన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నది. అయితే అజ్ఞాతవాసికి సంగీత దర్శకత్వం వహించిన అనిరుధ్ రవిచందర్‌ను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పిస్తారనే గాసిప్ వార్త నిజమవ్వడం గమనార్హం.

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ప్రారంభోత్సవానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ హాజరయ్యారు. అయితే అధికారికంగా వెల్లడికాకపోయినా ఆ చిత్రానికి ఆయనే సంగీత దర్శకుడు అనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అజ్ఞాతవాసి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో ఆయనను తొలగిస్తారనే వార్తలు ఊపందుకొన్నాయి.

అందరూ ఊహించినట్టే త్రివిక్రమ్, ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌ నుంచి అనిరుధ్ వెళ్లిపోయి ఎస్ఎస్ థమన్ వచ్చేశాడు. ఈ విషయాన్ని థమన్ అధికారికంగా ప్రకటించాడు. తాను త్రివిక్రమ్ సినిమాకు సంగీతం అందిస్తున్నట్టు ట్వీట్ చేశాడు.