Urvashi Rautela Getting problem through Phone Calls. She makes hot comments on Droupadi.
విశాల్ పాండ్య తెరకెక్కించిన రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రంహేట్ స్టోరీ 4 ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. మార్చ్ 9 న హేట్ స్టోరీ 4 చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. కాగా ఈ సిరీస్ లో వచ్చిన అన్ని చిత్రాలు మంచి విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. కాగా హేట్ స్టోరీ 4 చిత్రాన్ని మునుపటికంటే రిచ్ గా, యువతని ఆకర్షించే రొమాన్స్ తో తెరకెక్కించారు. ప్రచార చిత్రాలని చూస్తే ప్రధాన పాత్ర పోషిస్తున్న ఊర్వశి రౌటేలా గ్లామర్ షోతో రొమాంటిక్ సన్నివేశాల్లో చెలరేగిపోయినట్లు కనిపిస్తోంది.
ఊర్వశి రౌటేలా ఏకంగా టూ పీస్ బికినీ ఫోజులని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందాల కనువిందు చేస్తోంది. హేట్ స్టోరీ 4 చిత్రంలో కోసం ఊర్వశి గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. ప్రచార చిత్రాల్లోనే ఆమె అందాలు సెగలు పుట్టించేవిగా ఉన్నాయి.