కంటతడి పెట్టిస్తున్న శ్రీదేవి కూతురు లేఖ

2018-03-03 1,628

The eldest daughter of Bollywood actress Sridevi has paid a heartbreaking tribute to her mother just a week after her lost life and just days before the 20-year-old celebrates her 21st birthday.

శ్రీదేవి మరణం అభిమాన లోకాన్ని తీవ్ర మనస్తాపానికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు తమకు ఏ లోటూ లేకుండా చూసుకున్న అమ్మ ఇక లేదనే బాధ నుండి బయట పడటానికి జాన్వి కపూర్, ఖుషి కపూర్‌కు ఇప్పట్లో సాధ్యమయ్యే విషయం కాదు. ఈ బాధను దిగమింగుతూనే జీవితంలో కసిగా ఎదగాలని.... చెల్లికి, నాన్నకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి కపూర్. రామేశ్వరంలో తన తల్లి అస్తికలు కలిపిన అనంతరం ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ లేఖ విడుదల చేశారు.
త్వరలో రాబోయే నా పుట్టినరోజు నాడు మీ అందరినీ నేను ఒకే ఒక విషయం కోరాలని నిర్ణయించుకున్నాను. మీ తల్లిదండ్రులను ప్రేమించండి. వారి ప్రేమ ఎంతో విలువైనది. దాన్ని అనుభవించండి... అని జాహ్నవి కపూర్ తెలిపారు.నా తల్లిని అభిమానించే వారంతా..... ఆమె ఆత్మశాంతి కోసం ప్రార్థించాలని కోరుతున్నాను. అందరం ఆమె కోసం ప్రార్థనలు చేద్దాం అని జాహ్నవి కపూర్ పేర్కొన్నారు.
అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే....నా తల్లి తన జీవితంలోని ఎక్కువ భాగం ప్రేమను పప్పా(బోనీ కపూర్)తో పంచుకున్నారు. వారి ప్రేమ శాశ్వతమైనది. అలాంటి ప్రేమ ప్రపంచంలో మరొకటి లేదు. వారి ప్రేమకు రెస్పెక్ట్ ఇవ్వండి.... అంటూ జాన్వి పేర్కొన్నారు.
శ్రీదేవి మరణం నేపథ్యంలో బోనీ కపూర్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ మీడియా ప్రవర్తిస్తున్న తీరుతో జాన్వి కపూర్ హర్ట్ అయినట్లు ఉంది. అందుకే తన తల్లి, తండ్రి ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో చెప్పే ప్రయత్నం చేశారు.
నా మనసులో తీరని లోటు ఏర్పడింది. ఇకపై ఎలా జీవించాలనేది నేర్చుకోవాలి. ఈ లోటు ఉన్నప్పటికీ నేను నీ ప్రేమ అనుభూతిని పొందుతున్నాను. నువ్వు నన్ను బాధ నుంచి, నొప్పి నుంచి సంరక్షిస్తున్నట్లే అనిపిస్తోంది. కళ్లు మూసిన ప్రతిసారి నీ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి.' అని జాహ్నవి తన లేఖలో పేర్కొన్నారు.