Suresh Raina Records Helps His Comeback

2018-03-02 47

The Indian players are back in the country after a successful tour of South Africa and senior Suresh Raina is already back on the ground working on his fitness

దాదాపు రెండున్నరేళ్ల పాటు నిరీక్షించి భారత జట్టులో చోటు సంపాదించిన రైనాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. బ్యాట్ ఝుళిపించి మెరుపులు పుట్టించడంతో పాటు అవసరమైన సందర్భాల్లో స్పిన్ బౌలింగ్ వేసి వికెట్లు పడేయగలడు. అద్భుతమైన ఫీల్డింగ్ సైతం చేయగలడు.
కానీ, భారత జట్టుకు దూరంగా ఉన్న రైనా ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ 20 సిరీస్‌లో రాణించి మిగతా యువ క్రికెటర్లకు సవాల్‌ విసిరాడు. టీమిండియా క్రికెట్‌లో ఒకప్పుడు వెలుగు వెలిగిన ఆల్‌రౌండర్ సురేశ్‌ రైనా, ఇతని దృష్టి మొత్తం 2019 ప్రపంచకప్‌పైనే ఉంది అప్పటికి భారత వన్డే జట్టులో చోటు దక్కించుకోవాలనేది అతని లక్ష్యం. ఆ క్రమంలోనే సఫారీలతో టీ20 సిరీస్‌లో రైనా తన మార్కు ఆటను చూపెట్టాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 15, 31, 43 స్కోర్లు సాధించాడు. అంతేకాదు భారత జట్టు టీ 20 సిరీస్‌ను గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు శ్రీలంకలో జరిగే ముక్కోణపు సిరీస్‌లో రాణించి తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునే పనిలో పడ్డాడు. దాని కోసమే ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టేశాడు.
టీ 20ల్లో సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మన్‌ రైనా కాగా, టీ 20 వరల్డ్‌ కప్‌లో సెంచరీ చేసిన మొదటి క్రికెటర్‌ కూడా. మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారత ఆటగాడు కూడా రైనానే. ఇక వన్డే, టీ20 ప్రపంచకప్‌లలో సెంచరీలు చేసిన తొలి టీమిండియా క్రికెటర్‌ ఘనత రైనా సొంతం. ఇవన్నీ రైనా తిరిగి జట్టులో చోటు దక్కించుకోవడానికి ఉపయోగపడ్డాయనే చెప్పాలి.
గత కొంతకాలంగా నాల్గో స్థానంలో టీమిండియా కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంది. ప్రధానంగా ఈ స్థానంలో అజింక్యా రహానే, మనీష్‌ పాండేలతో పాటు పలువురు ఆటగాళ్లను పరీక్షించినా పెద్దగా ఫలితం కనిపించలేదు. ఆ క్రమంలోనే రైనా పునరాగమనం సులువుగా మారింది. మూడో స్థానంలో రైనా బ్యాటింగ్‌కు వస్తే, నాల్గో స్థానంలో పరుగుల మెషీన్‌ కోహ్లి ఉండనే ఉన్నాడు. ఈ రెండు స్థానాలను పటిష్టం చేస్తే ఏడో స్థానం వరకూ మన బ్యాటింగ్‌కు ఢోకా ఉండదు.