Chinese Condoms 'Too Small' For Zimbabwean Men

2018-03-02 5

Zimbabwe’s health minister calls for bigger condoms after complaining China-made ones are ‘too small’ for men in his country.

జింబాబ్వే ఆరోగ్య శాఖ మంత్రి డేవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జింబాబ్వేకు చైనా నుంచి దిగుమతి అవుతున్న కండోమ్‌ల సైజు చాలా చిన్నగా ఉంటున్నాయని, అవి తమ దేశ పౌరులకు సరిగా సరిపోవడం లేదన్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. అందువల్ల స్వదేశంలోని ఇండస్ట్రియలిస్ట్‌లు దేశ యువకులకు తగిన విధంగా కండోమ్‌ల పరిమాణాన్ని పెంచి, కండోమ్‌ల ఉత్పత్తి ప్రారంభించాలని పిలుపునిచ్చారు.
కండోమ్‌లు మనమే తయారు చేసుకుంటే విదేశీ దిగుమతులపై పెట్టే ఖర్చు తగ్గుతుందని, మన వాళ్లకు సరిపోయేలా ఉంటాయని సదరు మంత్రి అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికా ప్రాంతంలో ఎయిడ్స్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో కండోంలు వాడాలని తాము ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు.
దేశంలోని ప్రయివేటు కంపెనీలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీకు మరింత బిజినెస్ కావాలంటే ఇక్కడే తయారు చేయండని సూచించారు. ప్రస్తుతం యువత ఇష్టపడుతున్న కండోంలు తాము తయారు చేయడం లేదని సదరు మంత్రి చెప్పారు.
జింబాబ్వే మంత్రి డేవిడ్ వ్యాఖ్యలపై చైనా కండోమ్ కంపెనీ స్పందించింది. ఇక నుంచి వివిధ సైజుల్లో కండోంలు తయారు చేస్తామని చెప్పారు. కాగా, న్యూ జింబాబ్వే వెబ్ సైట్ ప్రకారం 2016లో ఆఫ్రికన్ కంట్రీలో 109 మిలియన్ల కండోంలు అమ్ముడయ్యాయి. సరాసరిగా ఒక్కొక్కరు 33 కండోంలు వాడినట్లు.

Free Traffic Exchange