షూటింగ్ లో ప్రమాదం : అందరూ శ్రీకాంత్ చనిపోయారనుకొన్నారు !

2018-03-02 1,038

Meka Srikanth is an Indian film actor, who is known for works predominantly in Telugu cinema. In his latest Interview he revealed so many things

1991లో సినిమా రంగంలోకి ప్రవేశించిన శ్రీకాంత్ టాలీవుడ్‌లో 100కుపైగా చిత్రాల్లో నటించారు. విలన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన తర్వాత హీరోగా మారాడు. తాజాగా రారా అనే హారర్ కామెడీ చిత్రంలో నటించాడు. ఈ సందర్భంగా ఓ ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌తో ముచ్చటించారు. శ్రీకాంత్ పంచుకొన్న వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలు మీకోసం..
సినిమాల్లో నేను రావడానికి చిరంజీవి ఇన్స్‌పిరేషన్. యూత్‌లో ఉన్నప్పుడు చిరంజీవి సినిమా రిలీజ్ అయితే డబ్బుల వెదజల్లి ఆనందపడేవాళ్లం. ఆయనను చూసే సినిమాల్లోకి రావడం జరిగింది. వచ్చాక ఆయన పక్కన శంకర్‌దాదా జిందాబాద్ సినిమాలో నటించడం ఓ గొప్ప అనుభూతి.
చిరంజీవి అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. ఆయనకు వీరాభిమానిని. ఏమిలేకుండానే కావాలని చిరంజీవిపై ఏదో వాగుతూ కెలికేవాళ్లు. దాంతో చాలాసార్లు చాలామందిని కొట్టాను. చిరంజీవిని ఎవరైనా ఏమన్నా అంటే సహించను
చిన్నతనంలో మా నాన్నతిట్టినందుకు చెరువులో దూకి చనిపోదామనుకొన్నాను. ఆ ఘటనకు ముందు ఏమి జరిగిందంటే... పక్క ఇంట్లో వాళ్ల జామచెట్టు నుంచి కాయలు దొంగిలించాను. దాంతో పక్కింటి వాళ్లు వచ్చి మా ఇంటిపై గొడవ చేశారు. దాంతో నన్ను మా నాన్న కోపగించారు. దాంతో సూసైడ్ చేసుకొందామరని అనుకొన్నాను.
హీరోయిన్ ఊహతో తొలిసారి ఆమె సినిమాలో కలిసి నటించాను. ఆ తర్వాత మొత్తం నాలుగు సినిమాలు చేశాం. దాంతో మా మధ్య పరిచయం పెరిగింది. మా ఇంట్లో జరిగే ఫంక్షన్లకు పిలిచేవాడిని. దాంతో మా కుటుంబ సభ్యులకు బాగా పరిచయమైంది. అలా పరిచయం మా మధ్య ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో 1991లో పెళ్లి చేసుకొన్నాం.