Jhanvi Kapoor mind blowing answer to Salman Khan in a tv show. Wanted movie team participated in Wanted promotions in 2009.
హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న టైంలో శ్రీదేవి బోనికపూర్ ని వివాహం చేసుకున్నారు. బోనికపూర్, శ్రీదేవి పై ప్రేమతో ఆ వివాహం చేసుకోలేదని అప్పట్లో విమర్శలతో కూడిన గుసగుసలు వినిపించాయి. బోనికపూర్ దృష్టి శ్రీదేవి ఆస్తిపైనే అని విమర్శించినా వారు లేకపోలేదు. అలాంటి వాళ్ళందరి నోళ్లు మూయించేలా శ్రీదేవి తుదిశ్వాస వరకు బోనికపూర్ తో 22 ఏళ్ల పటు అన్యోన్య దాపత్యం కొనసాగించారు. శ్రీదేవి, బోణి కపూర్ కు కండలవీరుడు సల్మాన్ ఖాన్ నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయా అనే ప్రశ్నని ఓ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ సంధించారు. అక్కడున్నవారంతా అవుననే సమాధానం ఇచ్చారు. కానీ శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ ఇచ్చిన సమాధానం మాత్రం సల్లూ భాయ్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది.
2009 లో విడుదలైన సల్మాన్ ఖాన్ చిత్రం వాంటెడ్ ని బోనికపూర్ నిర్మించారు. ఆ చిత్రం బాక్స్ ఆఫిస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అప్పటికి సల్మాన్ ఖాన్ ఓ టివి చానల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. వాంటెడ్ చిత్ర బృందం మొత్తం సల్లూ భాయ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న దస్ కా దం అనే షోకు హాజరయ్యారు.
ఆ షో ఆధ్యంతం సరదాగా సాగింది. శ్రీదేవి జ్ఞాపకాలని నెమరువేసుకుంటున్న నెటిజన్లు ఆ షోకు సంబందించిన వీడియో క్లిప్పింగ్స్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఈ షోలో సల్మాన్ ఖాన్ తన చిలిపి ప్రశ్నలు, అల్లరి చేష్టలతో అక్కడ ఉన్నవారందరిని హుషారెత్తించాడు.
ఆ తరువాత సల్లూభాయ్ అందరికి తెలిసిన విషయాన్నే ప్రశ్నగా సంధించాడు. వివాహాలు స్వర్గంలో నిశ్చయించబడతాయి. నిజమేనా అని సల్మాన్ ప్రశ్నించాడు.
వాంటెడ్ సినిమా సమయంలో జాన్వీ, ఖుషి చిన్నపిల్లలుగా ఉన్నారు. ఏ షోకి వారుకూడా హాజరు కావడం విశేషం. సల్మాన్ ఖాన్ వారి వంక తిరిగి దీనిగురించి మీరేమనుకుంటున్నారు డార్లింగ్స్ అని ప్రశ్నించాడు. ఖుషి నాకు తెలియదు అని చెప్పింది. కానీ జాన్వీ మాత్రం అందరికంటే భిన్నంగా స్పందించింది. పెళ్లిళ్ల గురించి నాకు తెలియదు. కానీ అమ్మానాన్నలు మాత్రం స్వర్గంలోని నిర్ణయించబడుతారు అని సమాధానం ఇచ్చింది. దీనితో అక్కడ ఒక్కసారిగా చప్పట్ల మోత మోగింది. జాన్వీ ఆన్సర్ కు సల్లూ భాయ్ కూడా ఆశ్చర్యపోయారు.