Sonam Kapoor Set To Auction

2018-03-01 616

Sridevi made Sonam Kapoor painting. Sridevi paintings all are set to auctioned in Dubai. Sridevi has been painting for many years, It’s her favourite pastime

శ్రీదేవి మంచి నటి మాత్రమే కాదు.. కళా ప్రియురాలు కూడా దాగి ఉంది. ఖాళీ సమయాల్లో శ్రీదేవి తనలోని చిత్ర కారిణిని బయటకు తీసేది. అలా శ్రీదేవి చేతి నుంచి జాలువారిన పెయింటింగ్ లలో బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ మరియు మైఖేల్ జాక్సన్ చిత్రాలు ఉన్నాయి. శ్రీదేవి మరణం తరువాత ఆ చిత్ర పటాల్ని దుబాయ్ లో వేలం పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర పటాల్ని ఇప్పటికే లక్షలు వెచ్చించి సొంతం చేసుకునేందుకు చాలా మంది ఎదురుచూస్తున్నారు.
సావరియా చిత్రం సందర్భంగా సోనమ్ కపూర్ ఇచ్చిన ఓ ఫోజు శ్రీదేవిని బాగా ఆకట్టుకుంది. అంతే తడువుగా తనకు నచ్చిన ఆ ఫోజుని శ్రీదేవి అదమైన పెయింటింగ్ గా మలిచింది.
పాప్ స్టార్ గా ఉర్రూతలూగించిన మైఖేల్ జాక్సన్ బొమ్మని కూడా శ్రీదేవి గీశారు.
ఈ రెండు చిత్రాలని దుబాయ్ లో వేలం వేయడానికి 2010 లో అంతర్జాతీయ ఆర్ట్ హౌస్ అనే సంస్థ శ్రీదేవిని సంప్రదించింది. కానీ అందుకు శ్రీదేవి ఒప్పుకోలేదు. కాగా వేలంలో వచ్చిన మొత్తాన్ని చారిటికి వాడతామని చెప్పడంతో శ్రీదేవి అంగీకరించారు
శ్రీదేవి చేతి నుంచి జాలువారిన సోనమ్ కపూర్, మైఖేల్ జాక్సన్ చిత్రాలని త్వరలోనే వేలంలో అమ్ముడుపోనున్నాయి.
తాను గీసిన చిత్రాలలో మైఖేల్ జాక్సన్ పెయింటింగ్ ఇటామని శ్రీదేవి ఓ సందర్భంలో అన్నారు. అందుకే ఆ ఒక్క చిత్ర కనీసధర 8 లక్షలుగా వేలం ప్రక్రియ మొదలు కానుంది.