The upcoming edition of the IPL is going to be very crucial for Yuvraj Singh. However, Yuvraj still believes he can make it to the Indian team and has revealed his retirement plans.
2019 వరల్డ్ కప్ వరకు క్రికెట్ అడతానని, ఆ తర్వాతే తన రిటైర్మెంట్‌పై ఓ నిర్ణయం తీసుకుంటానని టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. ఐపీఎల్ 11వ సీజన్ తనకు ఎంతో ముఖ్యమని, ఈ సీజన్‌లో మంచి ప్రదర్శన చేసి 2019 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసే ఆటగాళ్ల జాబితాలో తాను ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.
ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేయాలని చూస్తున్నా. ఈ టోర్నీ నాకు ఎంతో ముఖ్యం. ఎందుకంటే 2019 వరకు నేను క్రికెట్ ఆడగలనా లేదా అని నిర్ణయిస్తుంది. 2019 వరకు క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నా. అప్పటివరకు ఏ మేరకు అయితే క్రికెట్ ఆడతానో.. దానిని బట్టి రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకుంటా' అని లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుల కార్యక్రమంలో యువీ పేర్కొన్నాడు.
కెరీర్ ఉన్నతస్థాయిలో ఉన్నప్పుడు కూడా టెస్టు జట్టులో చోటు దక్కించుకోలేకపోవడంపై యువరాజ్ చింతించాడు. ఈ విషయంపై యువరాజ్ మాట్లాడుతూ 'నా కెరీర్ ప్రారంభంలో 6-7 ఏళ్ల పాటు నేను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పుడు టెస్టు క్రికెట్ ఆడే అకాశాలు ఎక్కువ లభించలేదు. అప్పట్లో దిగ్గజాలంతా టెస్టు జట్టులో ఉండటమే అందుకు కారణం. నాకు అవకాశం వచ్చినప్పుడు క్యాన్సర్‌కు గురయ్యా' అని యువీ చెప్పాడు.
గతేడాది ఇంగ్లాండ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం కరేబియన్ పర్యటనలో భారత్ తరుపున చివరగా ఆడాడు యువరాజ్ సింగ్. అప్పటి నుంచి తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఇందులో భాగంగా యువరాజ్ సింగ్ యో-యో టెస్టు కూడా పాసయ్యాడు.