The actress was taken from Lokhandwala towards Vile Parle for the last rites of Sridevi are scheduled to take place at 3:30 pm. Just before this, the actress was wrapped in a tricolour so that she could be cremated with state honours
వేలాది మంది తోడు రాగా శ్రీదేవి అంతిమయాత్ర కొనసాగుతున్నది. ముంబై వీధుల్లో అశ్రునయనాలతో ప్రజలు శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె అంతిమయాత్ర వెంట అభిమానులు వాహనాలపై కాన్వాయ్‌గా బయలుదేరారు. శ్రీదేవి ఫోటోలను చేతులో పెట్టుకొని ఆమె వెంట నడిచారు
శ్రీదేవి చివరి ప్రయాణాన్ని తనకు ఇష్టమైన కంచిపట్టు చీరతోనే ముగించింది. ఊహ తెలిసినప్పటి నుంచి ముఖానికి మేకప్‌తోనే జీవించింది. అలాంటి మేకప్ చివరి అంకంలోనూ ఆమె వెంట వచ్చింది. అంతిమయాత్ర కోసం శ్రీదేవిని అందంగా ముస్తాబు చేశారు.
దేశానికి అందించిన సేవలకు గుర్తుగా శ్రీదేవి పార్థీవ దేహంపై జాతీయ జెండాను కప్పి అధికారులు శ్రద్ధాంజలి ఘటించారు. ముంబై వీధుల్లో విషాదఛాయాలు నెలకొన్నాయి.