CBI Arrests Karti Chidambaram : What is the INX Media Case

2018-02-28 1

The CBI has been conducting a series of raids in connection with the criminal misconduct in the grant of Foreign Investment Promotion Board approval to foreign investments received by INX Media Pvt Ltd formerly owned by Peter and Indrani Mukerjea.

మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి తనయుడు కార్తీ చిదంబరాన్ని ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సిబిఐ అధికారులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. ఐఎన్ఎక్స్ మీడియాలోకి విదేశీ పెట్టుబడులు నిబంధనలకు విరుద్దంగా వచ్చాయని సిబిఐ ఆరోపిస్తోంది. ఈ కేసు విషయమై పదేళ్ళ తర్వాత కార్తీ చిదంబరం వ్యవహరం ఉందని గుర్తించిన సిబిఐ ఆయనపై కేసును నమోదు చేసింది. సిబిఐ ఆరోపణలను కార్తీ చిదంబరం కొట్టిపారేస్తున్నారు.అసలు ఐఎన్ఎక్స్ మీడియా కేసు అంటే ఏమిటో ఓ సారి తెలుసుకొందాం.
పీటర్, ఇంద్రనీ ముఖర్జీ యాజమాన్యంలోని ఐఎన్ఎక్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ విదేశీ పెట్టుబడులకు విదేశీ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం మంజూరు చేయడంలో నేరపూరిత దుష్ప్రవర్తనకు సంబంధించి సీబీఐ పలు వరుస దాడులను జరుపుతోంది.
ఇందులో భాగంగానే మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి కార్తీ చిదంబరానికి ఈ కేసులో లింకులున్నాయని గుర్తించిన సిబిఐ అధికారులు ఆయనను బుధవారం నాడు అరెస్ట్ చేశారు. కార్తీ చిదంబరానికి చెందిన సిఎను కూడ సోమవారం నాడు సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. అంతేకాదు అతడిని 14 రోజల పాటు జ్యూడిషీయల్ రిమాండ్‌కు తరలించారు.
ఐఎన్‌ఎక్స్‌ మీడియాలోకి విదేశీ పెట్టుబడుల ప్రొమోషన్‌ బోర్డు(ఎఫ్‌ఐపీబీ) క్లియరెన్స్‌ కోసం 2007 సంవత్సరంలో కార్తీ చిదంబరం రూ.3.5 కోట్లు అక్రమంగా వసూలు చేశాడని, ఆ డబ్బులను తన కంపెనీలోకి అక్రమ మార్గంలో మళ్లించుకున్నాడని సీబీఐ 2017 మేలో కార్తీ చిదంబరంపై కేసు నమోదు చేసింది.
నిబంధనలకు విరుద్దంగా ఉన్న సంస్థ ధరఖాస్తు విషయమై అధికారులను కార్తీ చిదంబరం ప్రభావితం చేశారని సిబిఐ అభిప్రాయపడింది.దీంతో ఆ సంస్థకు విదేశాల నుండి రూ 305 కోట్ల నిధులు వచ్చాయని సిబిఐ గుర్తించింది.