అతిలోక సుందరి శ్రీదేవి మరణాన్ని అభిమాన లోకం జీర్ణించుకోలేక పోతోంది. దుబాయ్‌లో శనివారం రాత్రి ఆమె కన్ను మూసిందనే విషయం తెలిసినప్పటి నుండి ఫ్యాన్స్ అంతా విషాదంలో మునిగిపోయారు. శ్రీదేవిది సహజ మరణం కాదని, అనేక అనుమానాలు ఉన్నాయంటూ పలు రిపోర్ట్స్ బయటకు రావడం, భారత మీడియాలో ఆమె మరణంపై పలు సంచలన కథనాలు అల్లడం, సుబ్రహ్మణ్య స్వామి లాంటి రాజకీయ నేతలు ఆమె హత్య చేయబడింది అంటూ వ్యాఖ్యలు చేస్తుండటంతో...... అభిమానుల్లో ఆందోళన మరింత తీవ్రం అయింది.