Sridevi Passes Away: It's Not A Cardiac Arrest, Twist ?

2018-02-27 3,919

She never drink hard liquor, how did it enter her body? What happened to CCTV? Doctors suddenly appeared before media & said she lost life of heart failure, said Subramanian Swamy. Indian Ambassador said that it does take 2-3 days to complete processes and then Sridevi will reach mumbai.


బాలీవుడు నటి శ్రీదేవిని హత్య చేశారని బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన ఆరోపణలు చేశారు. శ్రీదేవితో ఎవరు బలవంతంగా మద్యం తాగించారో చెప్పాలని, శ్రీదేవి మరణానికి ముందు ఆ గదికి ఎవరెవరు వెళ్ళారనే విషయాన్ని బయటపెట్టాలని సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేశారు.
సుబ్రమణ్యస్వామి మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా సుబ్రమణ్యస్వామి శ్రీదేవి మృతిపై సంచలన ఆరోపణలు చేశారు.
శ్రీదేవి శరీరంలోకి మద్యం ఎలా వచ్చిందని, హోటల్ రూమ్‌లో సీసీటీవి పుటేజీని ఎందుకు ఇవ్వలేదని సుబ్రమణ్యస్వామి ప్రశ్నించారు.
కాగా దుబాయ్‌లో మరణించిన శ్రీదేవి బౌతిక కాయం ముంబైకి తరలించడానికి ఇంకా రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉందని భారత దౌత్యాధికారులు అభిప్రాయపడుతున్నారు. కేసు తేలేవరకు తాము ఏం చేయలేమని భారత దౌత్యాధికారి చెబుతున్నారు. ఫిబ్రవరి 24వ, తేదిన దుబాయ్‌లోని హోటల్‌లో శ్రీదేవి మరణించింది. దుబాయ్ కాలమానం ప్రకారం శనివారం రాత్రి 10 గంటలకు ఆమె చనిపోయిందని సమాచారం.
ఫిబ్రవరి 24వ, తేది రాత్రి 10.01 నిమిషానికి చనిపోయిందని పోస్ట్ మార్టం నివేదిక చెబుతోంది. అయితే పోలీసులకు శ్రీదేవి మృతికి సంబంధించి శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఫోన్ చేశారని ప్రచారం సాగుతోంది. అయితే ఆ గంటలో ఏం జరిగిందనేది ప్రస్తుతం కీలకంగా మారింది. ఈ గంటలో చోటు చేసుకొన్న పరిణామాల్లో వాస్తవాలు తేలితే శ్రీదేవి మృతిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని దుబాయ్ పోలీసులు భావిస్తున్నారు.