Sridevi : Cops Question Boney Kapoor, Statement Recorded

2018-02-27 3

Boney Kapoor reportedly discovered Sridevi unconscious in the bathtub filled with water. Dubai Police called Kapoor to Dubai police station for investigation.

అందాల తార శ్రీదేవి ఆకస్మిక మృతి ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అవుతున్నది. సహజ మరణం అనుకున్న శ్రీదేవి మృతిపై ఇప్పుడు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. శ్రీదేవి మృతి అంశంలో ఇప్పటి వరకు సానుభూతి సొంతం చేసుకొన్న భర్త బోనికపూర్ వైపే అన్ని వేళ్లు చూపుతున్నాయి. ఈ వ్యవహారంలో బోని ప్రవర్తన తీరు అనుమానాస్పదమవుతున్నది. దీంతో శ్రీదేవి మరణం బోని మెడకు చుట్టుకుంటుందా అనే విధంగా అనేక అనుమానాలకు దారితీయడం ఈ కేసులో కొత్త మలుపుగా మారింది.
శ్రీదేవి మరణంలో అధికారులకు అనేక అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో బోనికపూర్ పాస్ట్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకొన్నారు. దుబాయ్‌కి బోని ఎప్పుడు వచ్చారు. ఎప్పుడు మళ్లీ భారత్‌కు వెళ్లాడు? ముంబైకి వెళ్లాడా? మరే పట్టణానికి వెళ్లాడా? లేదా ఇతర దేశానికి వెళ్లి వచ్చాడా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఫోరెన్సిక్ రిపోర్టు ఇవ్వడానికి కొన్ని గంటల ముందు నుంచి బోనీకపూర్‌ను దాదాపు 3 గంటలపాటు దుబాయ్ పోలీసులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నుంచి 9గంటల మధ్యలో ఏం జరిగింది? శ్రీదేవి భౌతికకాయాన్ని ఎవరు చూశారు? ఆమెను బయటకు తీసుకురావడానికి ఎవరు సాయపడ్డారు? శ్రీదేవిని టబ్‌‌లో అపస్మారకస్థితిలో చూసిన తర్వాత ఆమెను ఆస్పత్రికి ఎవరెవరు తరలించారు? తదితర ప్రశ్నలతో పాటు అక్కడి పరిస్థితులపై ఆరా తీసినట్లు సమాచారం.
సెలబ్రిటీ కేసు కావడంతో ప్రపంచవ్యాప్తంగా దృష్టి ఉండటం వలన ఈ అంశాన్ని దుబాయ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నట్టు సమాచారం.