Sridevi News : అర్జున్ కపూర్ ఇబ్బంది పెట్టేవాడని చెప్పిన శ్రీదేవి

2018-02-27 2,116

Sridevi's uncle reveals interesting facts about Sridevi. He made shocking comments on Arjun Kapoor

శ్రీదేవి అకాలమృతితో ఆమె అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంటే, సోమవారం సాయంత్రం నుంచి దుబాయ్ లో జరుగుతున్న పరిణామాలు అందరిని విస్మయానికి గురిచేస్తున్నాయి. శ్రీదేవి మృతిలో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుపతిలో ఉన్న శ్రీదేవి బంధువు వేణు గోపాల్(శ్రీదేవికి బాబాయ్ ) ఓ ఇంటర్వ్యూ లో పలు విషయాలు వెల్లడించారు.
శ్రీదేవి బంధువులం కనుక ఆమె గురించి బయట వారికన్నా మాకే ఎక్కువ తెలుసు అని వేణుగోపాల్ అన్నారు. శ్రీదేవి స్టార్ అయ్యాక రాకపోకలు తగ్గాయి.. కానీ శ్రీదేవి మమ్మల్ని మాత్రం మర్చిపోలేదు. నా కొడుకు ఉమేష్ ని బాగా చూసుకునేది. మేము ఇల్లు కట్టుకుంటుంటే కూడా సాయం చేసింది. ఆమెని కలుసుకోవడానికి ఎప్పుడు వెళ్లినా ఖచ్చితంగా సాయం చేస్తుంది
బోనికపూర్ కూడా తమతో బాగా ఉండేవారని ఆయన అన్నారు. భాష సమస్య వలన సరిగా మాట్లాడలేకపోవచ్చు. కానీ తమకు బాగా మర్యాద ఇచ్చేవారు అని అన్నారు.
శ్రీదేవి మృతి విషయంలో టీవీలో ఏవేవో చూపిస్తున్నారు. అక్కడ ఏం జరిగిందో మాకు కూడా తెలియదు.
శ్రీదేవి ఇబ్బందులో ఉన్నట్లు, మనసులో బాధ పడుతున్నట్లు మాతో చెప్పలేదు. బోనికపూర్ గారి మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్ ఇబ్బంది పెట్టేవాడిని బంధువులతో శ్రీదేవి చెప్పుకుని భాదపడిందని విన్నాం అని వేణుగోపాల్ అన్నారు
తన భర్త ఆరోగ్యం గురించి శ్రీదేవి ఎప్పుడూ దిగులు పడేదని, బోనికపూర్ ఓ సారి షుగర్ బాగా ఎక్కువవడంతో తాను, పిల్లలు ఏమైపోతామో అని దిగులు చెందినట్లు మా బంధువులు చెబితే విన్నాం అని ఆయన అన్నారు.