Forensic doctors in Dubai concluded that Sridevi lost life of a heart problem and added there is nothing suspicious about the way the superstar passed away, official sources in Dubai said.
శ్రీదేవి ఆకస్మిక మరణం దేశవ్యాప్తంగా ప్రతీ ఒక్కరిని శోక సంద్రంలో ముంచెత్తింది. అరోగ్యంగా, ఎంతో ఆహ్లాదంగా కనిపించే అందాల తార మరణించడంపై జీర్ణించు కోలేకపోతున్నారు. అంత సడెన్‌గా మరణించడంపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దుబాయ్ ఫోరెన్సిక్ వైద్యుల నివేదిక చాలా కీలకంగా మారింది. తాజాగా వైద్యులు నివేదికను వెల్లడించారు.
శ్రీదేవి ఓ భారతీయ సినిమాకు చెందిన ప్రముఖురాలు కావడంతో ఈ కేసును దుబాయ్ ప్రభుత్వం, అక్కడి వైద్యులు చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. ఎలాంటి అనుమానాలు వ్యక్తమైనా ఆ కోణంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందుకే ఫోరెన్సిక్ రిపోర్టు వెల్లడి కావడంలో జాప్యం జరిగింది.
వాస్తవానికి శ్రీదేవి మృతదేహాన్ని ఆదివారం రాత్రే ముంబైకి చేర్చాల్సి ఉంది. అందుకనుగుణంగా ఆమె పార్దీవదేహాన్ని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ రక్త నమూనాల రిపోర్టు రాకపోవడంతో శ్రీదేవి దేహాన్ని తరలించే విషయంలో ఆలస్యమైంది.
సాధారణంగా ఏ వ్యక్తి అయినా హాస్పిటల్‌లో మరణిస్తే ఆ వ్యక్తి మరణానికి సంబంధించిన కారణం వెంటనే తెలుస్తుంది. అయితే శ్రీదేవి మృతి హాస్పిటల్‌లో కాకుండా బయట జరిగినందున పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసిన తర్వాతే మృతదేహాన్ని సంబంధీకులకు అప్పగిస్తారు.
పోలీసుల దర్యాప్తు, వైద్యుల శవపరీక్ష జరుగుతుండగానే ఎంబసీలో వీసా వెరిఫికేషన్ ప్రాసెస్ నిర్వహిస్తారు. అన్ని నిర్ధారించుకొన్న తర్వాత మృతురాలి పాస్‌పోర్టును దుబాయ్‌లోని భారతీయ ఎంబసీలో రద్దు చేస్తారు. ఆ తర్వాత పార్దీవ దేహాన్ని తరలించేందుకు డెత్ సర్టిఫికెట్ జారీ చేస్తారు.