Nidahas Trophy 2018 : Why MS Dhoni Rested for T20I Tri-series ?

2018-02-26 406

According to Reports, Virat Kohli, MS Dhoni, Bhuvneshwar Kumar, Jasprit Bumrah and Hardik Pandya won’t be part of the squad for the T20I Tri-series. In Kohli’s absence Rohit will lead Team India

శ్రీలంకలోని కొలంబో వేదికగా మార్చి 6 నుంచి జరగనున్న ముక్కోణపు టీ20 టోర్నీ కోసం ఎంపిక చేసిన జట్టు నుంచి మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి విశ్రాంతి కల్పించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుని ఆదివారం ప్రకటించిన సెలక్టర్లు.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ధోని, పాండ్యా, పేసర్లు బుమ్రా, భువీలకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.

వీరి స్థానంలో యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చి, కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. 52 రోజులు సుదీర్ఘమైన దక్షిణాఫ్రికా పర్యటనలో సీనియర్ క్రికెటర్లు పూర్తిగా అలసిపోయారు. దీంతో ఏప్రిల్‌లో ఐపీఎల్ 11వ సీజన్, ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటన ఉన్న నేపథ్యంలో సీనియర్లకు విశ్రాంతి ఇచ్చామని సెలక్టర్లు చెప్పారు. అయితే ఈ విశ్రాంతి జాబితాలో మాజీ కెప్టెన్ ధోని పేరు ఉండటం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకంటే.. టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ఇప్పుడు కేవలం వన్డే, టీ20లు మాత్రమే ఆడుతున్నాడు.