సినీ దేవి.. శ్రీ దేవీ ఇక లేరు.! విషాదంలో సచిన్‌తో సహా పలువురు క్రికెటర్లు

2018-02-25 109

హైదరాబాద్: సీనియర్‌ నటి శ్రీదేవి(54) హఠాన్మరణం చెందడంతో పలువురు క్రికెటర్లు షాక్‌కు గురైయ్యారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుబాయ్‌లో ఆమె కన్నుమూశారు. ఓ వివాహ వేడుకకు హాజరైన ఆమె.. గుండెపోటుతో తుది శ్వాస విడిచారని సంజయ్‌ కపూర్‌ ద్రువీకరించారు. ఈ విషయం తమను షాక్‌కు గురిచేసిందని పలువురు క్రీడా ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.
టీమిండియా క్రికెటర్లు వీవీఎస్‌ లక్ష్మణ్‌, మహ్మద్‌ షమీ, ఆకాశ్‌ చోప్రా, అశ్విన్‌, ప్రజ్ఞాన్‌ ఓజా, రెజ్లింగ్‌ స్టార్స్‌ సింగ్‌ బ్రదర్స్‌, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పారుపల్లి కశ్యప్‌, ప్రముఖ క్రికెట్‌ వ్యాఖ్యాత హర్షబోగ్లేలు ట్విటర్‌ వేదికగా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.