Puri Akash Movie...Charmi Relaxed

2018-02-24 1

Mehbooba movie shoot finished. Puri Jagannadh first time directing his son Akash as hero.

పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరీని హీరోగా పెట్టి దర్శకత్వం వహిస్తున్న చిత్రం మెహబూబా. 1971 ఇండియా, పాక్ వార్ నేపథ్యంలో ప్రేమ కథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆ మద్యన విడుదలైన మెహబూబా టీజర్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇండియా పాక్ బోర్డర్ లో జరుగుతున్న యుద్ధ సన్నివేశాలని పూరి అబ్బురపరిచేలా చూపించారు. కాగా ఈ చిత్ర షూటింగ్ పూరైంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసి సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నారు.
తనయుడు ఆకాష్ పూరితో పూరిజగన్నాథ్ చేస్తున్న తొలి చిత్రం మెహబూబా. దీనితో పూరిజగన్నాథ్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
పూరి జగన్నాథ్ కు దర్శకుడుగా మంచి ప్రతిభ ఉంది. కానీ కథలపై సరిగా దృష్టి పెట్టడనే విమర్శలు ఉన్నాయి. మెహబూబా చిత్రానికి పూరి జగన్నాథ్ పూర్తిగా తన శక్తి సామర్థ్యాలని వినియోగించి చేసినట్లు టీజర్ ద్వారా స్పష్టంగా అర్థం అయింది.
మెహబాబా చిత్ర యూనిట్ తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. దీనితో చార్మి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టడం విశేషం.
మెహబూబా చిత్ర షూటింగ్ పూర్తికావడంతో భారం మొత్తం తగ్గిపోయి లైట్ అయిపోయామని చార్మి ట్విట్టర్ లో పేర్కొంది. చిత్ర యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు తెలిపింది.
ఈ చిత్రంలో ఆకాష్ పూరి సరసన అందాల నేహా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. సోషల్ మీడియాలో నేహా శర్మ ఘాటు అందాలు యువతని ఆకర్షిస్తున్నాయి.
మెహబూబా చిత్రం 1971 ఇండియా, పాక్ వార్ నేపథ్యంలో రూపొందించారు. వార్ సన్నివేవాలు ఉంటూనే మెహబూబా చిత్రాన్ని పూరి ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపొందించినట్లు తెలుస్తోంది.