Salman Khan On wedding : I D'nt Have Stamina

2018-02-24 123

Salman Khan Is Single Because Weddings Are Expensive. Salman Khan 's shocking answer on his wedding.

కండల వీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి ఎదురుచూసిన అభిమానులకు, పెళ్లి ఎప్పుడంటే సమాధానాలు చెప్పి విసిగిపోయిన సల్మాన్ ఖాన్ కు నీరసం వచ్చేసింది. అందుకే పెళ్లి ప్రస్తావన తీసుకుని వచ్చినప్పుడల్లా సల్మాన్ వెటకారంగా సమాధానం ఇస్తున్నాడు.
ఈ బాలీవుడ్ కండల వీరుడు వయసులో అర్థసెంచరీ కొట్టి రెండుళ్లు అవుతోంది. జీవితాంతం సింగిల్ గానే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడో ఏమో తెలియదు. పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచించకుండా జీవితం గడిపేస్తున్నాడు.
సల్మాన్ ఖాన్ నేడు ముంబైలో ఓ ఈవెంట్ కు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా మీడియా నుంచి ఎప్పటిలాగే పెళ్లి ఎప్పుడునే ప్రశ్న ఎదురైంది.
ఈప్రశ్నకు సల్మాన్ ఇచ్చిన సమాధానం అందరిని ఆశ్చర్యపరిచింది. పెళ్లి అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అప్పట్లో మా తండ్రి వివాహం రూ 180 తో ముగిసిపోయిందట. కానీ ఈ రోజుల్లో పెళ్లి అంటే కోట్లతో కూడుకున్న వ్యవహారం. అమ్మాయి కోసం వెతికే ప్రక్రియ నుంచి వివాహం తరువాత భార్య కోసం చేసే ఖర్చు వరకు అంతా డబ్బుతో ముడిపడి ఉంటుంది. అలాంటి ఖర్చు నేను భరించలేను. ఆ శక్తి నాకు లేదు అంటూ సమాధానం ఇచ్చాడు
సల్మాన్ నుంచి ఊహించని సమాధానం ఎదురుకావడంతో అక్కడున్న మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోయారు.