Ramayanam and Mahabharatam are the two Mythological books for indians. They were going to be directed visually by Allu Aravind and Madhu Mantena Varma as producers.ఇప్పుడున్న టెక్నాలజీతో రామాయణం, మహాభారతం వంటి పురాణాల్ని వెండి తెర అద్భుతాలుగా మలచవచ్చు. యుద్దాలు, రాజుల నేపథ్యంలో తీసిన రాజమౌళి బాహుబలి చిత్రం ఎలాంటి అద్భుతాలు చేసిందో అందరికి తెలిసిందే. కాగా మహా భారత కావ్యాన్ని ఇప్పటి టెక్నాలజీతో వెండి తెరపై ఆవిష్కరించాలని రాజమౌళి వంటి దర్శకుల మదిలో ఉంది. అది ఎప్పుడు ప్రారంభం అవుతోందో కానీ.. రామాయణాన్ని ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించడానికి తొలి అడుగు పడింది. టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ ఇందులో భాగస్వామిగా ఉండడం విశేషం.
మహాభారతం, రామాయణాలు హిందువులకు పవిత్ర గ్రంధాలు. ఈ పురాణాల్లో అద్భుత చిత్రంగా మలచడానికి దర్శకులకు కావాల్సినంత కంటెట్ ఉంది. మహా భారతాన్ని వెండితెర పై ఆవిష్కరించాలనే ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
రామాయణాన్ని దాదాపు రూ 500 కోట్లతో నిర్మించడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పదం జరగడం విశేషం.
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్, బాలీవుడ్ నిర్మాతలు మధు మంతెన మరియు నమిత్ మల్హోత్రా ఈ ఒప్పందాన్ని యూపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్నారు. యూపీ రాష్ట్రంలో సినిమా విభాగం అయిన ఫిల్మ్ బంధుతో ఎంఓయూ కుదిరింది.
మూడు భాషల్లో, త్రీడి టెక్నాలజీలో ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మించడానికి ప్లానింగ్ జరుగుతోంది.