హైదరాబాద్: నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడ సుభాష్‌నగర్‌లో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఫార్మా కంపెనీ గోడౌన్‌లో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి.
ఈ ప్రమాదంలో పరిశ్రమలో పనిచేస్తున్న 8 మంది కార్మికులకు తీవ్ర గాయలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు