India vs South Africa: Dhoni Achieved Records And Feats With T20 Fifty

2018-02-22 45

MS Dhoni, who smashed 3 sixes in the match and has now scored a total of 44 sixes in T20Is. It is the third highest by a wicketkeeper, only followed by Mohammad Shahzad and Brendon McCullum

సెంచూరియన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన రెండో టీ20లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హాఫ్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. చాన్నాళ్ల తర్వాత ధోని హాఫ్ సెంచరీ నమోదు చేయడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సోషల్ మీడియా వేదికగా ధోనిపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ మ్యాచ్‌లో ధోని కేవలం 28 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. టీ20ల్లో ధోనికి ఇది రెండో హాఫ్ సెంచరీ కావడం విశేషం . ఈ హాఫ్ సెంచరీతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ధోని అనేక రికార్డులు తన పేరిట సొంతం చేసుకున్నాడు.
మనీశ్‌ పాండే-ధోనీ జోడీ ఐదో వికెట్‌కు అజేయంగా 98 పరుగులు జోడించారు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఐదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జాబితాలో వీరు నాలుగో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో షోయబ్‌ మాలిక్‌-మిస్బా ఉల్‌ హాక్‌(119 నాటౌట్‌), యువీ-ధోనీ(102 నాటౌట్‌), కోలింగ్‌ ఉడ్‌-షా(102) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
సెంచూరియన్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో చివరి రెండు ఓవర్లలో ధోని 28 పరుగులు సాధించాడు. దీంతో అతి తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు సాధించిన భారత బ్యాట్స్‌మెన్లలో ధోని రెండోవాడిగా అరుదైన ఘనత సాధించాడు. 2007లో ఇంగ్లాండ్‌పై యువరాజ్‌ సింగ్‌ 10 బంతుల్లో 44 పరుగులు సాధించాడు.
సఫారీ గడ్డపై వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో ధోని రెండోవాడిగా నిలిచాడు. భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన తొలి టీ20లో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ కూడా 27 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేయడం విశేషం.