IND VS SA : Dhoni Loses His Cool Gets Angry At Manish Pandey

2018-02-22 1,305

In final over of India's innings when Dhoni was at the crease. After the first ball, Dhoni was seen yelling at Pandey, asking him to focus towards him and not look elsewhere

భారత మాజీ కెప్టెన్ ధోనీ అంటే గుర్తొచ్చేది అతనిలోని కూల్‌నెస్. ఫీల్డ్‌లోనే కాదు మైదానం బయటా అలానే కనిపించే ధోనీ ఆగ్రహానికి గురైయ్యాడు. ఆ విషయాన్ని ధోనీ మనిష్ పాండే విషయంలో పక్కన పెట్టేశాడు. దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 లో వరుస వికెట్ల పడిపోతోన్న సమయంలో క్రీజులోకి వచ్చిన ధోనీ బౌండరీలతో రెచ్చిపోయాడు.
అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న పాండే భాగస్వామ్యంతో తిరుగులేని షాట్‌లు ఆడినా మ్యాచ్ ను గెలిపించలేకపోవడం నిరాశకు గురి చేసింది. సూపర్ స్పోర్ట్ పార్క్ వేదికగా జరిగిన రెండో టీ20లో వీళ్లిద్దరి మధ్య చక్కని భాగస్వామ్యం నెలకొంది. నాలుగో వికెట్ అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ధోనీ.. పాండేతో కలిసి 108 పరుగులను చేశాడు. దీంతో స్కోరు బోర్డు 188పరుగులకు పరిగెత్తింది.
మ్యాచ్ ఆఖరి ఓవర్లో పాండే చెప్పిన మాట వినకపోవడంతో కాస్త ఆవేశానికి గురైయ్యాడు ధోనీ. 'ఓయ్... ఇక్కడ చూడు. అటు ఏముందని చూస్తున్నావ్' అంటూ కాస్త గట్టిగానే చెప్పాడు. అయితే ఆఖరి వాక్యం వినపడింది కానీ, మొదటి వాక్యం స్టంప్ మైక్ లో సరిగా వినబడకపోవడంతో నెటిజన్లు తమదైన శైలిలో ఆ ఖాళీలను పూరిస్తున్నారు.
మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచిన ఆఖరి ఓవర్‌లో ధోనీ 17పరుగులు చేశాడు. కసిగా విజృంభించి పరుగులు చేశాడు. ఎప్పుడూ ఇలాంటి పదాల్ని వాడని ధోనీ ఎందుకు అంత ఆవేశానికి గురి కావాల్సి వచ్చిందో తెలియాలంటే వీడియో చూడాల్సిందే.