Super 30 First Look : Hrithik Roshan Sells Papad

2018-02-22 1

A new picture of Hrithik Roshan, from the sets of Super 30, has surfaced the Internet. Hrithik is seen selling paapad on a bicycle.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అనగానే మనకు కండలు తిరిగిన శరీరం, సూపర్ మ్యాన్ లాంటి కటౌట్ గుర్తుకు వస్తుంది. అయితే ఇపుడు హృతిక్ ఎవరూ గుర్తుపట్టనంతలా మారిపోయి జైపూర్లో సైకిల్ మీద తిరుగుతూ అప్పడాలు అమ్ముకుంటూ కనిపించాడు. అఫ్‌కోర్స్ ఇదంతా సినిమా కోసమే అనుకోండి... అయితే తమ అభిమాన హీరో లుక్ ఇలా ఉండటం చూసి అభిమానులు సైతం షాకవుతున్నారు.
హృతిక్ రోషన్ ప్రస్తుతం ‘సూపర్ 30' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగులో భాగంగానే ఆయన జైపూర్ వీధుల్లో సైకిల్ మీద తిరుగుతూ అప్పడాలు అమ్ముతూ కనిపించారు. ఈ చిత్రానికి వికాస్ భల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ గణితశాస్త్ర నిపుణుడు, సూపర్‌ 30 కోచింగ్‌ సెంటర్‌ అధినేత ఆనంద్‌ కుమార్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
పట్నాకు చెందిన మ్యాథమెటీషియన్‌ ఆనంద్‌ కుమార్‌ ఏటా ఆర్థికంగా వెనుకబడిన 30 మంది విద్యార్థులకు ఐఐటీ పరీక్ష రాయడానికి శిక్షణ ఇస్తుంటారు. దీని వల్ల పేదరికంలో ఉన్న ప్రతిభగల విద్యార్థుల జీవితాలు ఎలా మారిపోయాయి అనే పాయింటును ఫోకస్ చేస్తూ ఈ సినిమా సాగుతుంది.
సూపర్ 30' సినిమాకు సంబంధించి హృతిక్ రోషన్ ఫోటోస్ ఇపుడు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. ఇప్పటికే ‘కాబిల్' చిత్రంలో అంధుడిగా నటించిన హృతిక్ ఇపుడు సూపర్ 30లో ఎలాంటి గ్లామర్ లేకుండా కనిపిస్తూ ప్రయోగానికి సిద్ధం కావడం సాహసమే.