Renuka Chowdhury In an interview has opened up about her College days and revealed the intresting matters of the College campus
రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి తన కాలేజీ రోజులను గుర్తుచేసుకున్నారు. 'ఐ డ్రీమ్' అనే ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా.. తాను ముందు నుంచి మొండి ఘటాన్నే అన్న విషయాన్ని చెప్పారు. సమాజంలో అన్ని రకాల మనుషులు ఉంటారని, వాళ్లతో నెగ్గుకు రావాలని రేణుకా చౌదరి అభిప్రాయపడ్డారు. ఆమె వ్యాఖ్యపై స్పందిస్తూ 'కాలేజీ రోజుల్లో అబ్బాయిలు మీ దగ్గరకు రావాలన్నా భయపడి ఉండేవాళ్లేమో' అని యాంకర్ ఓ సందేహం వ్యక్తం చేశారు.
యాంకర్ సందేహానికి బదులిచ్చిన రేణుకా..' అవును పిచ్చిపిచ్చిగా ప్రవర్తించినందుకు మోటార్ సైకిల్ చైన్‌తో అప్పట్లో ఒకరిని ఉతికినా!, అప్పటి నుంచి నేనంటే ఏంటో బాగా తెలుసు.' అని కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. శివ సినిమాలో హీరో నాగార్జున సైకిల్ చైన్‌తో విలన్లను ఉతికారేస్తే.. రేణుకా చౌదరి మోటార్ సైకిల్ చైన్‌తో ఉతికేశారన్నమాట. ఒకవిధంగా అప్పట్లో రేణుకా చౌదరి 'లేడీ శివ' అనాలేమో!. 'నేను ఎవరినైనా చావకొడుతుంటే, ఆటోవాళ్లు, వేరేవాళ్లు కూడా హెల్ప్ చేస్తుండేవారు. అసలు విషయమేంటో తెలియకుండానే నాకు హెల్ప్ చేసేందుకు ముందుకు వచ్చేవాళ్లు.' అంటూ బిగ్గరగా నవ్వేశారు.
ఇక సోషల్ మీడియాపై స్పందిస్తూ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లోని వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని, ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని రేణుకా అభిప్రాయపడ్డారు.