Karan Johar Comments on Prabhas

2018-02-22 1,801

Saaho is one of the most awaited films of Prabhas after the super success of Baahubali. The producers in North are not showing any interest in Prabhas' upcoming film because of the actor's complicated relationship with Karan Johar.

బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో చిత్రం కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఇబ్బందుల్లో కూరుకుపోయినట్టు తెలుస్తున్నది.
ప్రభాస్, బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్‌ జోహర్ కరణ్ జోహార్ మధ్య ఉన్న విభేదాల కారణంగానే సాహో చిత్రాన్ని ఉత్తరాది నిర్మాతలు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదట. ప్రభాస్, కరణ్ మధ్య విభేదాలకు కారణమేమిటంటే..
బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగి పోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే సాహోను భారీ బడ్జెట్‌తోపాటు అత్యంత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నారు. ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసమే సుమారు రు. 30 కోట్లు ఖర్చు చేశారనేది సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
ప్రభాస్, కరణ్ జోహర్ మధ్య నెలకొన్న విభేదాలకు అసలు కారణంపై ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. బాహుబలి తర్వాత ప్రభాస్‌తో కరణ్ జోహార్ ఓ సినిమా ప్లాన్ చేశారట. ఆ సినిమాకు ప్రభాస్ కూడా సానుకూలంగా స్పందించారట. కానీ ప్రభాస్ చెప్పిన రేటు విని కరణ్ షాకయ్యాడట. దాంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందట. దాంతో కరణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడనేది బాలీవుడ్ పత్రికల కథనం.
బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఏర్పడిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేశాడు. అందుకోసం ప్రభాస్‌ను సంప్రదించగా... 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో కరణ్ వెనక్కి తగ్గాడట.