Nirav Modi denied allegations levelled against him by Punjab National Bank (PNB), his advocate Vijay Aggarwal on Tuesday said that the loan amount was Rs 280 crores, which may go up to Rs 5,000 crores and not 11,500 crores
నీరవ్ మోడీ తీసుకున్న రుణ మొత్తంరూ.11,500 కోట్లు అనే మాటను ఆయన తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ కొట్టిపారేశారు. పంజాన్ నేషనల్ బ్యాంక్ లావాదేవీల వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను నీరవ్ మోడీ ఖండించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ మంగళవారం అర్థరాత్రి మీడియాతో మాట్లాడారు. రుణం మొత్తం 280 కోట్ల రూపాయలు మాత్రమేనని, అది రూ.5,000 కోట్ల రూపాయలకు చేరి ఉండవచ్చునని ఆయన అన్నారు. ఇప్పుడు చెబుతున్నట్లుగా అది రూ.11,500 కోట్ల రూపాయలు కాదని అన్నారు.
సిబిఐ గణాంకాలను చూపిస్తూ విజయ్ అగర్వాల్ ఆ మాటలన్నారు. సొమ్ము రూ.280 కోట్ల రూపాయలని సిబిఐ స్వయంగా చెబుతోందని, అది 5000 కోట్ల రూపాయలకు చేరి ఉంటుందని, రూ.11,500 కోట్ల రూపాయలనే లెక్కలు మీడియాకు ఎలా వచ్చాయో తెలిదని ఆనయ అన్నారు.
బ్యాంక్ కోట్లాది రూపాయలు తీసుకుందని విజయ్ అగర్వాల్ ఆరోపించారు. మొత్తం వ్యవహారం బ్యాంకుకు తెలిసే జరిగిందని, బ్యాంక్ కమిషన్ రూపంలో కోట్లాది రూపాయలు తీసుకుందని, ఇప్పుడు ఖండిస్తోందని అన్నారు.
అవి వాణిజ్య లావాదేవీలు మాత్రమేనని, ఇప్పుడు దాన్ని ఫ్రాడ్‌గా చిత్రీకరిస్తున్నారని విజయ్ అగర్వాల్ అన్నారు. చాలా ఏళ్లుగా బ్యాంక్‌కు వాటాలు దక్కుతున్నాయని ఆయన అన్నారు.
నీరవ్ మోడీ ఎక్కడికీ పారిపోలేదని, ఆయన ప్రపంచ వాణిజ్యవేత్త అని, కేసు వెలుగులోకి వచ్చిన సమయంలో వ్యాపార కార్యకలాపాలపై ఆయన విదేశాల్లో ఉన్నారని, ఇప్పుడు ఆయన పాస్‌పోర్టును రద్దు చేశారని విజయ్ అగర్వాల్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యుల్లో కొందరు విదేశీ పౌరులని, ఎక్కువగా విదేశాల్లోనే ఉంటారని ఆయన చెప్పారు.