Mani Ratnam's New Project Details

2018-02-20 90

Filmmaker Mani Ratnam’s upcoming multi-starrer, which features an ensemble cast of Arvind Swami, Simbu, Vijay Sethupathi, Arun Vijay, Aditi Rao Hydari, Jyothika and Aishwarya Rajesh

మణిరత్నం మరోసారి ప్రతిష్ఠాత్మకంగా ఓ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించడానికి సిద్దమవుతున్నారు.ఈ సినిమాలో పాత్రలను మణిరత్నం చాలా సంచలనాత్మకంగా రూపొందిస్తున్నట్టు సమాచారం. చెక్క చివంత వానమ్ చిత్రాన్నితెలుగులో ఈ సినిమాకు నవాబ్ అనే పేరును ఖరారు చేయడం గమనార్హం.
తాజాగా బయటకు వచ్చిన నవాబ్ విషయాలు ఇవే..మణిరత్నం తెరకెక్కించనున్న సినిమా నవాబ్ చిత్రంలో అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి, శింబు, ప్రకాశ్ రాజ్, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, అదితి రావు హైదరీ తదితరులు నటిస్తున్నారు.ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పోలీస్ ఆఫీసర్‌గా, అరవింద్ స్వామి రాజకీయ నేతగా నటిస్తున్నట్టు తెలిసింది. అలాగే యెన్నైఅరిందాల్‌లో విలన్‌గా కనిపించిన అరుణ్ విజయ్ ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించనున్నారు.
మణిరత్నం సినిమాలో తొలుత మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలకపాత్రకు ఎంపిక చేసినప్పటికీ ...డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఫహాద్ ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారు. ఈ పాత్ర కోసం అంగమలి డైరీస్ ఫేం శరత్ ఎంపిక చేసినట్టు సమాచారం.ఈ సినిమాకు సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
రెండు జంటల మధ్య రొమాంటిక్ రిలేషన్‌షిప్స్, సోషల్ డ్రామాగా మణిరత్నం సినిమాను తెరకెక్కించనున్నారట. ఈచిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.