CBI arrested three more employees of the Punjab National Bank on Monday over the Rs. 11,400 crore loan fraud case involving celebrity jeweller Nirav Modi.
నీరవ్ మోడీ కుంభకోణంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన మరో ముగ్గురు ఉద్యోగులను సిబిఐ సోమవారం అరెస్టు చేసింది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) పర్యవేక్షణ వైఫల్యం వల్లనే కుంభకోణం జరిగిందని కేంద్రం అభిప్రాయపడినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ నేపథ్యంలో సిబిఐ మరో ముగ్గురిని అరెస్టు చేసింది. సిబిఐ ఇదివరకే ఇద్దరిని అరెస్టు చేసింది. తాజాగా అరెస్టయిన అధికారులు పర్యవేక్షణ లోపాలకు కారణమని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీరు ముగ్గురు కూడా ఇది వరకు అరెస్టయిన ఇద్దరు ఉద్యోగుల కన్నా పైస్థాయికి చెందినవారు.
ఓ బ్యాంక్‌కు చెందిన ఓ శాఖలో జరిగిన ఇంత పెద్ద భారీ కుంభకోణాన్ని రిజర్వ్ బ్యాంక్ పసిగట్టలేకపోవడం దాని వైఫల్యమేనని కేంద్ర ఆర్థిక శాఖ తప్పు పట్టినట్లు తెలుస్తోంది. పద్ధతి ప్రకారం జరిగిన వైఫల్యం పర్యవేక్షణ లోపానికి సంబంధించిందంటూ ప్రభుత్వం ఆర్బీఐకి లేఖ రాసింది.
సోమవారం అరెస్టయినవారిలో ఫారిన్ ఎక్స్‌ఛేంజీ డిపార్టుమెంట్ ఇంచార్జీగా వ్యవహరిస్తున్న చీఫ్ మేనేజర్ బచ్చు తివారీ, అదే శాఖలోని మేనేజర్ యశ్వంత్ జోషీ, మరో బ్యాంక్ అధికారి ప్రఫుల్ సావంత్ ఉన్నారు.
నీరవ్ మోడీపై, మెహుల్ చోక్సీపై పోలీసులు లుకవుట్ నోటీసులు జారీ చేశారు. తగిన సాక్ష్యాధారులను సేకరించడానికి సిబిఐ అధికారులు మరోసాని పంజాబ్ నేషలన్ బ్యాంక్ బ్రాంచ్‌లో సోదాలు నిర్వహించారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) మరిన్ని దాడులు నిర్వహించింది. రూ.22 కోట్ల విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. ఏడు ఆస్తులను ఆదాయం పన్ను శాఖ స్వాధీనం చేసుకుంది. ఇప్పటి వరకుస్వాధీనం చేసుకున్న ఆభరణాలు, జెమ్స్ విలువ రూ.5,671 కోట్ల రూపాయలు ఉంటుంది.