IND VS SA 1st T20 : Dhoni Picks Most Catches in T20s

2018-02-19 69

Dhoni surpassed Kumar Sangakkara, who had 133 catches in 254 matches. India's Dinesh Karthik is third on the list with 123 catches in 227 games followed by Pakistan's Kamran Akmal and West Indian Denesh Ramdin.

జోహెన్స్‌బర్గ్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. తొలి టీ20లో సఫారీ ఆటగాడు హెండిక్స్ (70) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భువీ వేసిన 18వ ఓవర్ తొలి బంతికి ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో హెండ్రిక్స్ క్యాచ్ అందుకోవడం ద్వారా ధోని టీ20ల్లో అత్యధిక క్యాచ్‌లను అందుకున్న వికెట్ కీపర్‌గా సంగక్కర పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర 194 ఇన్నింగ్స్‌ల్లో 133 క్యాచ్‌లు పట్టగా.. ధోని 262 ఇన్నింగ్స్‌ల్లో 134 క్యాచ్‌లు పట్టాడు.
భారత్‌కు చెందిన మరో వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. కార్తీక్ 196 ఇన్నింగ్స్‌ల్లో 123 క్యాచ్‌లు పట్టాడు. ఆ తర్వాతి స్థానాల్లో పాకిస్థాన్‌ అక్మల్ (203 మ్యాచ్‌ల్లో 115), వెస్టిండిస్‌కు చెందిన రామ్‌దిన్ (166 ఇన్నింగ్స్‌ల్లో 108), భారత్‌కు చెందిన నమాన్ ఓజా (166 ఇన్నింగ్స్‌ల్లో 106 క్యాచ్‌లు) ఉన్నారు