India started the T20I series with a comprehensive 28-run win over South Africa. Shikhar Dhawan’s 39-ball 72 and Bhuvneshwar Kumar 5 wickets contributions made india won. catch highlights of India vs South Africa 1st T20.
జోహెన్స్ బర్గ్ వేదికగా భారత జట్టుతో జరిగిన తొలి టీ20లో టాస్ గెలిచిన ఆతిథ్య దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. సుమారు ఏడాది తర్వాత సీనియర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా జట్టులోకి తిరిగొచ్చాడు. మూడు టీ20ల సిరిస్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా జేపీ డుమిని వ్యవహరించాడు.
కాగా తొలి టీ20లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 204 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులకే కుప్పకూలింది. ఛేజింగ్‌కు అనుకూలించే పిచ్ మీద కోహ్లి సేన చరిత్ర సృష్టించింది. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో భువీ హ్యాట్రిక్ దెబ్బకు సఫారీలు చిత్తయ్యారు. 48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను హెండ్రిక్స్ (70), ఫర్హాన్ బెహర్డీన్ (39) ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. ఈ క్రమంలో బెహర్డీన్‌ను చాహల్ తన స్పిన్ మాయతో పెవిలియన్‌కు చేర్చాడు.
దీంతో సఫారీ జట్టు 15 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఆ తర్వాత సఫారీలు దూకుడుగ ఆడుతున్న సమయంలో ఇన్నింగ్స్ 18వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన భువీ.. తొలి బంతికే హెండ్రిక్స్ (70)ను పెవిలియన్‌కు చేర్చాడు. నాలుగు, ఐదు బంతుల్లో క్లాసేన్ (7 బంతుల్లో 16), మోరీస్ (0)ను ఔట్ చేశాడు
చివరి బంతికి ప్యాటెర్‌సన్‌ను పాండ్యా, ధోని రనౌట్ చేయడంతో భువీ హ్యాట్రిక్ సాధించాడు. ఒకే ఓవర్లో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ పూర్తిగా భారత్ చేతిలోకి వచ్చింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, చాహల్, ఉనద్కత్ తలో వికెట్ తీశారు. తాజా విజయంతో మూడు టీ20ల సిరిస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఫిబ్రవరి 21 (బుధవారం) సెంచూరియన్ వేదికగా జరగనుంది.