Kohli has racked up three more ODI hundreds in India's 5-1 series win against South Africa and people are finding it hard to come up with new phrases to describe his batting.
కోహ్లీని పొగిడేందుకు పదాలు సరిపోవేమో డిక్షనరీ కొనుక్కోండి' ఈ మాటలు అంటోంది ఎవరో కాదు భారత జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి. సిరీస్ గెలవడమే కాదు. కేవలం నియమానుసారం జరగాల్సిన మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన చేసి.. నాయకుడిగా జట్టు సభ్యులతోనూ అదే రీతిలో ఆడించాడు. దీనికి గానూ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో ప్రధాన కోచ్ విలేకరుల ముందు కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తాడు.
కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సఫారీ గడ్డపై తొలి సిరీస్ విజయాన్ని అందుకుంది. 'కోహ్లీని పొగుడుతూ రాయడానికి బహుశా మీకు పదాలు కరువై ఉంటాయి. మీకు ఒక సలహా ఇస్తా. ఒకవేళ మీ స్థానంలో నేను ఉంటే నేరుగా బుక్‌స్టోర్‌కు వెళ్లి కొత్త ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు కొనుక్కుంటాను. నా పద సంపదను పెంచుకుంటాను' అని తెలిపాడు.
సగటును బట్టి కాదు ఎప్పుడైనా బ్యాట్స్‌మెన్ ఎలాంటి సమయంలో పరుగులు రాబడుతున్నాడో మనం చూడాలి. అవి జట్టు విజయానికి ఎంత కీలకంగా మారాయో గుర్తించాలి. ప్రపంచంలోని మేటి బ్యాట్స్‌మెన్లలో కోహ్లీనే బెస్ట్' అని శాస్త్రి అన్నాడు. ఆరు వన్డేల సిరీస్‌లో కోహ్లీ 558 పరుగులు పరుగులు సాధించిన సంగతి తెలిసిందే.
గతంలో నేను భారత జట్టు డైరెక్టర్‌గా ఉన్న సమయంలో నేను కోహ్లీ.. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి జట్ల భాగస్వామ్యాన్ని ఎలా విడదీయలన్న దాని గురించి చర్చించాం. ఇప్పుడు మాకు కుల్‌దీప్ యాదవ్-చాహల్ దొరికారు. ఈ ఇద్దరూ మంచి ప్రదర్శన ఇస్తున్నారు. బ్యాటింగ్, ఫీల్డింగ్, స్పిన్ బౌలింగ్‌లో గొప్పగా రాణిస్తున్నారు. భవిష్యత్తులో మేం మరిన్ని విదేశీ పర్యటనలు చేయాల్సి ఉంది. అలాంటి సమయంలో దక్షిణాఫ్రికా పర్యటన ప్రస్తుత భారత జట్టుకు ఎంతో నేర్పింది. యువ ఆటగాళ్లకు ఇదో మంచి అవకాశం' అని రవిశాస్త్రి వివరించాడు.