TDP Targets Modi Says Somu Veerraju

2018-02-17 425

BJP MLC Somu Veerraju said that he will ask Jana Sena chief Pawan Kalyan over the implementaion of the election manifesto of Telugu Desam party by chandrababu naidu.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి ధ్వజమెత్తారు. చంద్రబాబుపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మీద ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసిందని ఆయన శనివారం తెల్చేశారు. చెప్పనవన్నీ చేసిన పార్టీ తమ బిజెపి మాత్రమేనని ఆయన అన్నారు. చంద్రబాబుపై ప్రశ్నలు కూడా కురిపించారు.
తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికను ఏ మేరకు అమమలు చేసిందో తాను జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌నే అడుగుతానని సోము వీర్రాజ్ అన్నారు. ఎవరో కొన్ని సంఘాలు పెట్టినంత మాత్రాన తమకేమీ నష్టం లేదని అన్నారు. పవన్ కల్యాణ్ జెఎఫ్‌ని ఉద్దేశించి ఆయన ఆ వ్యాఖ్య చేశారు.మిత్రపక్షంగా ఉంటూనే తెలుగుదేశం పార్టీపై తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తోందని సోము వీర్రాజు అన్నారు. టిడిపితో పొత్తు వద్దని తాము ఎక్కడా అనలేదని గుర్తు చేశారు. రాజీనామాల అంశం వైసిపి, తెలుగుదేశం ఆడుతున్న డ్రామాలని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలోని ఏడు వెనుకడి జిల్లాలకు కేంద్రం 30 శాతం రాయితీ ఇచ్చిందని సోము వీర్రరాజు గుర్తు చేస్తూ ఆ జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని అడిగారు. తాము ఇచ్చిన రాయితీలతో చంద్రబాబు ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారని అడిగారు. తమ పార్టీ ఎదుగుతుందనే భయంతోనే టిడిపి తమపై బురద చల్లుతోందని ఆయన అన్నారు.
కేంద్రం ఇచ్చిన రాయితీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసిందే చంద్రబాబు సంజాయిషీ ఇవ్వాలని, శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం ఏం బాకీ ఉందో కూడా చంద్రబాబు చెప్పాలని ఆయన అడిగారు.