Yuzvendra Chahal cleaned up AB de Villiers for 30. South Africa 105/3 in OVERS 20.5. Shardul Thakur gave India an early breakthrough, dismissed Hashim Amla for 10. at South Africa 23/1
సిరిస్‌లో చివరిదైన ఆఖరి వన్డే సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ పార్క్ స్టేడియం వేదికగా జరుగుతుంది. ఇప్పటికే ఆరు వన్డేల సిరిస్‌ను సొంతం చేసుకున్న కోహ్లీసేన ఆఖరి వన్డేలో కూడా విజయం సాధించి అదిరిపోయే ముంగిపు ఇవ్వాలని భావిస్తోంది. ఆఖరి వన్డే అయినా గెలిచి పరువు కాపాడుకోవాలనే ప్రయత్నంలో సఫారీ జట్టు ఆరాటపడుతోంది. ఈ నేపధ్యంలో అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మ్యాచ్ లో టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. ఆరో వన్డే ప్రయోగాలకు వేదిక అవుతుందని అందరూ భావించారు. అయితే కేవలం భువనేశ్వర్‌కు మాత్రమే ఈ వన్డేలో విశ్రాంతినిచ్చారు. అతనికి బదులుగా శార్దూల్ ఠాకూర్‌ను తుది జట్టులోకి తీసుకొచ్చారు. కాగా తొలుత బ్యాటింగ్ చేస్తున్న సఫారీ జట్టు అంతగా ఆకట్టుకోలేక పోతుందనే చెప్పొచ్చు.
భారత జట్టులో మరో యువకెరటం మెరుస్తోంది. స్పిన్నర్లు కుల్‌దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్‌తో పాటుగా సఫారీలపై మరో బౌలర్ తన మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నాడు. శార్దూల్ ఠాకూర్ పది ఓవర్లు పూర్తయ్యేసరికి సఫారీ జట్టు ప్రధాన రెండు వికెట్లను తీశాడు.
6.3 ఓవర్‌లో శార్దూల్ ఠాకూల్ బౌలింగ్‌లో హషిమ్ ఆమ్లా(10) ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం తొమ్మిదో ఓవర్లలో మరో ఓపెనర్ మర్‌క్రమ్ 24 వికెట్‌ను చేజిక్కించుకున్నాడు శార్దూల్ . మిగతా బౌలర్లు కూడా నిలకడగా బౌలింగ్ చేస్తుండటంతో సఫారీ జట్టు 11ఓవర్లు ముగిసే సరికి 45పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది.