Malayalam superstar Mohanlal unveiled his rustic look as Ithikkara Pakki from the upcoming period film Kayamkulam Kochunni, which has Nivin Pauly in the lead role.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఎవరూ ఊహించని ఒక డిఫరెంట్ లుక్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన మలయాళ మూవీ 'కాయంకులం కొచ్చున్ని'లో నటిస్తున్నారు. నివిన్ పాలీ హీరోగా తెరకెక్కుతున్న ఈ చితం 19వ శాతాబ్దానికి చెందిన ఒక దొంగల గ్యాంగ్ నేపథ్యంతో సాగుతుంది. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మోహన్ లాల్ ఫస్ట్ లుక్ విడుదలైంది.
‘కాయంకులం కొచ్చున్ని' చిత్రంలో మోహన్ లాల్ ‘ఇత్తిక్కారపక్కి' అనే పేరుగల పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో పాత్ర చాలా కీలకంగా ఉండబోతోంది. హీరో నివిన్ పాలీ ట్విట్టర్ ద్వారా మోహన్ లాల్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ఇత్తిక్కారపక్కి' పాత్రలో మోహన్ లాల్ అరివీర భయంకరుడిగా, యోధుడిగా కనిపించబోతున్నాడు. ఆయనకు ఈ లుక్ పర్ఫెక్టుగా సూటయిందని, తెరపై సరికొత్త మోహన్ లాల్‌ను చూడబోతున్నాం అంటున్నారు అభిమానులు.
మోహన్ లాల్ సినిమాలు చూస్తూ పెరిగిన నివిన్ పాలీ.... తాను హీరోగా నటిస్తున్న చిత్రంలో తన అభిమాన నటుడు భాగం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల మోహన్ లాల్ షూటింగులో జాయిన్ అవ్వగానే ఆయనకు వెల్ కం చెబుతూ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
కాయంకులం కొచ్చున్ని' ఒక పీరియడ్ ఫిల్మ్‌గా తెరకెక్కుతోంది. 19వ శతాబ్దానికి చెందిన ‘కాయంకులం కొచ్చున్ని' అనే దోపిడీ దొంగ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. బ్రిటిష్ పాలన సమయంలో సెంట్రల్ ట్రావెన్ కోర్ ప్రాంతంలో ధనవంతులను దోచుకుని పేదలకు పంచే దొంగ కథ. ఈ చిత్రంలో మోహన్ లాల్ వీరికి సహాయ పడే ఇత్తికార పక్కి అనే దొంగ పాత్రలో కనిపించనున్నాడు.