Cauvery Water Dispute SC Verdict, Here Are The Reactions

2018-02-16 282

The Supreme Court verdict on Cauvery saddens me. This verdict will cause more damage to the Tamil Nadu farmers, says T.T.V. Dhinkaran. M.K.Stalin condemns government for lost the tn rights of cauvery water share and urges government to call for all party meeting immediately

కావేరీ నీటి పంపిణి విషయంలో సుప్రీం కోర్టు సంచనల తీర్పు ఇవ్వడంతో తమిళనాడులోని రాజకీయ పార్టీల నాయకులు స్పంధించారు. తమిళనాడుకు అన్యాయం జరిగిందని, తీర్పును మళ్లీ సుప్రీం కోర్టులోనే సవాలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్, బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్, హీరో మకల్ హాసన్, టీటీవీ దినకరన్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తిరునావుక్కరసర్ తదితరులు తమిళనాడుకు అన్యాయం జరిగిందని అంటున్నారు.
అన్నాడీఎంకే ప్రభుత్వం నిర్లక్షం కారణంగా తమిళనాడు పరువు పోయిందని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ మండిపడ్డారు. తమిళనాడు రైతులకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు ఏమి చెయ్యాలో చర్చించడానికి వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చెయ్యాలని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు.
కావేరీ నీటి పంపిణి విషయంలో సుప్రీం కోర్టు తీర్పు విని తాను షాక్ కు గురైనానని ప్రముఖ నటుడు కమల్ హాసన్ అన్నారు. 2007లో కావేరీ ట్రైబ్యునల్ బోర్డు ఆదేశాల మేరకు తమిళనాడుకు 192 టీఎంసీల నీరు రావాలని, సుప్రీం కోర్టు దానిని తగ్గించి 177 టీఎంసీలు విడుదల చెయ్యాలని తీర్పు ఇవ్వడం విచారకరం అన్నారు. అయితే సుప్రీం కోర్టు తీర్పు పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాత తాను మాట్లాడుతానని కమల్ హాసన్ వివరించారు.
కావేరీ నీటి పంపిణి విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చాలా బాధకలిగించిందని బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్ అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక ప్రభుత్వం వెంటనే తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చెయ్యాలని తమిళసై సౌందరరాజన్ డిమాండ్ చేశారు.