Cauvery Water Dispute Verdict

2018-02-16 256

The Supreme Court will pronounce its verdict on the Cauvery issue between Karnataka and Tamil Nadu since the time of the British TIME on Friday.

దశాబ్దాలుగా సాగుతున్న కావేరీ జల వివాదంపై సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది. నీటి పంపకంపై 2007నాటి కావేరీ జల వివాద పరిష్కార ట్రైబ్యునల్‌ (సీడబ్ల్యూడీటీ) తీర్పును వ్యతిరేకిస్తూ కర్ణాటక, తమిళనాడు విడివిడిగా సుప్రీం ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర, జస్టిస్‌ ఏఎం ఖాన్‌విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లు సభ్యులుగాగల ధర్మాసనం ఈ అప్పీళ్లపై విచారణ చేపట్టింది.
అనంతరం గత ఏడాది సెప్టెంబరు 20న తీర్పును రిజర్వుచేసింది. కేసు విచారణ సమయంలో తమిళనాడుకు నీటిని విడుదల చేయాలంటూ కర్ణాటకకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆదేశాలను సమీక్షించాలని కర్ణాటక సమీక్షా పిటిషన్‌ దాఖలుచేసింది. అయితే ట్రైబ్యునల్‌ కేటాయింపుల కంటే కేరళ కూడా అదనంగా నీటిని తీసుకుంటోందని తమిళనాడు ఆరోపిస్తోంది. 2007లో కావేరీ జలాలను 740 (టీఎంసీ)గా లెక్కించిన సీడబ్ల్యూడీటీ.. తమిళనాడుకు 419 టీఎంసీలు, కర్ణాటకకు 270 టీఎంసీలు, కేరళకు 30 టీఎంసీలు, పుదుచ్చేరికి 7 టీఎంసీలు కేటాయించింది.
రెండు దశాబ్దాలకు పైగా తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల మధ్య ఉన్న కావేరీ జలాల వివాదం పై సుప్రీం కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది.