Jabardasth Hyper Aadhi Love Proposal pic goes viral on social media. Hyper Aadhi shared that pic in Twitter
హైపర్ ఆది..గత కొంత కాలంగా ఈ పేరు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. జబర్దస్త్ షోలో కామెడీ పంచులతో విపరీతమైన పాపులారిటీని ఈ యువ నటుడు సంపాదించాడు. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో కమెడియన్ గా కూడా ఎదుగుతున్నాడు. ఇటీవల విడువులైన తొలిప్రేమ చిత్రంలో హైపర్ ఆది కమెడియన్ గా నటించి మెప్పించాడు. హైపర్ ఆది వాలంటైన్స్ డే సందర్భంగా ఓ యువతికి మోకాళ్లపై కూర్చుని పోవే ప్రపోజ్ చేస్తున్న ఫోటోని తన ట్విట్టర్ లో షేర్ చేసాడు. స్ప్రెడ్ లవ్ అంటూ క్యాప్షన్ కూడా తగిలించాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆది లవ్ ప్రపోజ్ చేసిన ఆ యువతి ఎవరంటూ తెగ చర్చ జరుగుతోంది.
వరుణ్ తేజ్ తొలిప్రేమ చిత్రంతో కమెడియన్ ఆ ఆది అవకాశాన్ని అందుకున్నాడు. ఈ చిత్రంలో తన పాత్ర పరిధి మేరకు ఆది చక్కగా నటించి నవ్వించాడు. ఆది నటనకు మంచి మార్కులు పడ్డాయి.
హైపర్ ఆది సోషల్ మీడియాలో యువతికి లవ్ ప్రపోజ్ చేస్తున్నట్లు ఉన్న ఫొటో వైరల్ గా మారింది. వాలంటైన్స్ డే సందర్భంగా ఆది ఈ ఫోటో షేర్ చేసాడు.
ఆది షేర్ చేసిన ఫొటోలోని యువత ఎవరు అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. ఆమె నిజంగానే ఆది గర్ల్ ఫ్రెండా అనే చర్చ జరుగుతోంది. కాగా దీనిపై ఆరా తీయగా విదేళ్లలో ఓ యువతితో ఇచ్చిన ఫోటో పోజు మాత్రమే అని తేలింది.