Andhra Farmer Creative idea, What's Sunny Leone doing in farms?

2018-02-14 187

In Nellore, banners of Sunny Leone erected across the cabbage and cauliflower farm owned by Chenchu Reddy. Look closely at the banners and they read: ‘Orey Nannu Choosi Yedavaku Raa’ (Don’t cry at me)

నరదిష్టికి నాపరాయికి అయినా పగిలిపోతుందనేది ఓ నానుడి...ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ దిష్టి విషయంలో అత్యంత జాగ్రత్త వహిస్తుంటారు. పంటపొలాల్లో, నూతన కట్టణాల నిర్మాణాల సమయాల్లో వివిధ రకాల దిష్టి బొమ్మలను ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో చూసే ఉంటారు. అయితే సాధారణంగా దిష్టి బొమ్మలుగా భయంకరంగా ఉండే ఆకారాలనో లేక అసభ్యకరంగా ఉండే బొమ్మలనో పెడుతుండటం ఆనవాయితి... అయితే నెల్లూరు జిల్లాలో ఒక రైతు ఏమాలోచించాడో ఏమో కానీ తన పొలం దగ్గర వినూత్నమైన దిష్టి చిత్రం ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. దిష్టి తగలకుండా ఆ రైతు పెట్టిన బొమ్మ నర దిష్టిని ఎంత వరకు తప్పికొడుతుందో తెలియని గాని జనాలందరి నోళ్లో మాత్రం బాగా నానుతోంది...ఇంతకీ ఆ రైతు దిష్టి నివారణకు పెట్టిన బొమ్మ ఏంటంటే...ఒకనాటి వరల్డ్ పోర్న్ స్టార్...నేటి బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్...ఏంటి ఆశ్చర్యంగా ఉందా?...కాబట్టే కదా...అందరూ ఇదే విషయం వింతగా చెప్పుకుంటున్నారు...ఒక్క సన్నీ లియోన్ పిక్చరే కాదండీ...మళ్లీ దానికో క్యాచీ క్యాప్షన్ కూడా పెట్టాడీ రైతు...ఈ విచిత్రం ఎక్కడో...ఏంటో చూసేయండి మరి...
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం బండకిందపల్లి, బ్రహ్మేశ్వరం గ్రామాల్లో రైతులు బెండ, క్యాబేజీ, కాలీఫ్లవర్‌ వంటి కాయగూరల సాగు చేపట్టారు. మొక్కలు ఏపుగా పెరగడంతో దారి వెంబడి పోయేవారి దృష్టంతా పంట పడుతోందట. ఇది గమనించిన ఓ రైతు...తన పంటలకు దిష్టి తగలకుండా ప్రముఖ శృంగార తార సన్నీలియాన్‌ అర్ధనగ్న పోస్టర్‌ను అక్కడ ఏర్పాటు చేశారు.