Look how Meera Jasmine is now, shocking

2018-02-14 5,655

Meera Jasmine got fame with Madhavan starrer 'Run', 'Ammayi Bagundi' and Pawan Kalyan's 'Gudumba Shankar'. Meera Jasmine latest look gives shock. After long time Meera jasmine appears in jewellery shop

అమాయక చూపులు, చిరు నవ్వు తో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్న మీరా జాస్మిన్ గత కొంత కాలంగా వెండి తెరకు దూరమైంది. మీరా జాస్మిన్ కెరీర్ లో చాలా మంది బడా స్టార్ల సరసన నటించి మెప్పించింది. చాలా కాలం పాటు మీరా టాప్ హీరోయిన్ల లీగ్ లో కొనసాగింది. 2016 నుంచి వెండి తెరపై కనిపించడం లేదు. వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. మీరా తాజాగా ఓ జ్యువెలరీ షాప్ లో మెరిసింది. మీరా లేటెస్ట్ లుక్ , ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మీరా జాస్మిన్ సూపర్ హిట్ చిత్రం అమ్మాయి బాగుందితో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే తెలుగు వారిని మీరా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ మీరాకు ఫిదా అయిపోయారు.
స్వతహాగా మలయాళీ అయిన మీరా జాస్మిన్ సినిమాల్లో అచ్చ తెలుగు అమ్మాయిలా అలరించింది. చీర కట్టులో ఆమె అందానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయ్యే వారు.
ఎంత క్రేజ్ వచ్చినా మీరా జాస్మిన్ ఎప్పుడూ గ్లామర్ షో పాత్రలు వేయలేదు. ఆ తరహా పాత్రలకు మీరా పూర్తిగా వ్యతిరేకం.
మీరా జాస్మిన్ తాజాగా ఓ జ్యువెలరీ షాప్ లో మెరిసింది. బాగా బొద్దుగా తయారైన ఉన్న మీరాని చూడ గానే పోల్చుకోవడం కాస్త కష్టమే. బొద్దుగా ఉన్న కూడా చీర కట్టులో మీరా జాస్మిన్ అందంగానే కనిపిస్తోంది.
అనిల్ జాన్ అనే వ్యక్తిని మీరా జాస్మిన్ 2014 లో వివాహం చేసుకుంది. మీరా చిరవరగా 2016 లో ఓ మలయాళీ చిత్రంలో మెరిసింది. ఆ తరువాత మీరా జాస్మిన్ వెండి తెరకు దూరమైంది.