CCTV captures shocking chain Snatching incidents

2018-02-13 330

A man riding on a bike dragged a 52-year-old woman at least 70 metres before snatching her 13 gms gold chain in full public view at Arumbakkam.

చెన్నై నగరంలో చెయిన్ స్నాచర్లు చెలరేగిపోతున్నారు. మెడలో ఉన్న గొలుసు తెగకపోవడంతో కిందపడిన మహిళను చైన్ తో పాటు దాదాపు 70 మీటర్లు దూరం లాక్కెళ్లారు. తీవ్రగాయాలైన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. మరోచోట భర్త కళ్ల ముందే ఓ మహిళ బంగారు గొలుసు చాకచక్యంగా లాక్కొని పరారైనారు. మహిళల ప్రాణాలతో చెలగాటం ఆడి చైయిన్ స్నాచింగ్ చేసి పుదుచ్చేరిలో తలదాచుకున్న ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు చోట్ల సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.
చెన్నైలోని వాషర్ పేటకు చెందిన మేనక (47) అరుంబాక్కంలో నివాసం ఉంటున్న బంధువుల ఇంటి దగ్గరకు నడిచి బయలుదేరారు. ఆ సమయంలో ఇద్దరు యువకులు బైక్ లో ఆమెను వెంబడించారు. జనసంచారం లేని ప్రాంతంలో మేనక మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొవాలని ప్లాన్ వేశారు.
ఒంటరిగా వెలుతున్న మేనక మెడలో ఉన్న బంగారు గొలుసు బైక్ లో వెనుక కుర్చుని ఉన్న యువకుడు లాగాడు. అది ఎంతకూ తెగకపోవడంతో మేనక కిందపడిపోయారు. ఆ సమయంలో బంగారు గొలుసు వదలని నిందితులు ఆమెసు సుమారు 70 మీటర్లు లాక్కొని వెళ్లారు. ఆసమయంలో మేనక మెడ తెగిపోయింది.
ఇక మరోపక్క కద్రతూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న అశోక్ కుమార్ (61), జయశ్రీ (56) దంపతులు ఇంటి సమీపంలో నడిచి వెలుతున్నారు. ఆ సమయంలో దంపతులను వెంబడించిన ఓ యువకుడు వెనుక నుంచి ఆమె మెడలో బంగారు గొలుసు లాగేశాడు. జయశ్రీ కిందపడటంతో గొలుసు తెగిపోయింది.