Dhoni closer to the 10,000- odi run mark, if he can reach the milestone in his next two odi innings, he will become the fourth fastest to the mark.
ప్రస్తుతం కోహ్లీసేన సుదీర్ఘమైన సిరిస్ కోసం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. సఫారీ పర్యటనలో భాగంగా ధోని మరో రెండు మైలురాళ్లకు అడుగు దూరంలో నిలిచాడు. శనివారం జోహెన్స్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో వన్డేలో ధోని 42 పరుగులతో అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తన వన్డే కెరీర్‌లో పదివేల పరుగులు చేయడానికి ఇంకా 46 పరుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం ధోని 9,954 వన్డే పరుగులతో భారత తరపున అత్యధిక పరుగులు చేసిన వారిలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో మరో హాఫ్ సెంచరీని సాధిస్తే, పదివేల పరుగుల మైలురాయిని ధోని అందుకోనున్నాడు.
ఇక, రెండో మైలురాయి విషయానికి వస్తే వన్డేల్లో ఇప్పటి వరకు ధోని 295 క్యాచ్‌లను పట్టాడు. మరో ఐదు క్యాచ్‌లు పడితే మూడొందల క్యాచ్‌లు పట్టిన ఏకైక భారత వికెట్ కీపర్‌గా ధోని అరుదైన ఘనత సాధిస్తాడు. ఆరు వన్డేల సిరిస్‌లో మరో రెండు వన్డేలు మిగిలుండటంతో ఈ సఫారీ పర్యటనలోనే ధోని ఈ రెండు ఘనతలు సాధిస్తాడని అభిమానులు అనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే అంతర్జాతీయ క్రికెట్‌లో ధోని బ్యాట్స్‌మన్‌గా 316 వన్డే మ్యాచ్‌లకుగాను 271 ఇన్నింగ్స్‌లు ఆడాడు. వన్డేల్లో ధోని అత్యధిక వ్యక్తిగత స్కోరు 183 నాటౌట్. ఇక కీపర్‌గా 311 ఇన్నింగ్స్‌ల్లో 401 ఔట్లలో భాగస్వామ్యమయ్యాడు. ఇందులో 106 స్టంపింగ్స్ ఉన్నాయి. కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 400 ఔట్లలో భాగస్వామి అయిన వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు.