Kajal Aggarwal And Nithya Menen Walks Out Of This Movie

2018-02-10 820

Kajal Aggarwal and Nithya Menen gives shock to Sharwanand. These two heroines are walks out of sharwanand project.

శర్వానంద్ ఇటీవలే స్వామిరారా ఫేమ్ సుదీర్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం అయింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా ఆదిలోనే చిత్ర యూనిట్ కి, శర్వానంద్ కు భారీ షాక్ తగిలింది. ఈ చిత్రం కోసం ఎంపిక చేసుకున్న హీరోయిన్లు హ్యాండిచ్చారట. దీనితో కొత్త హీరోయిన్ల వేటలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో హీరోయిన్స్ గా కాజల్ అగర్వాల్, నిత్యామీనన్ లని ఎంపికచేశారు. అధికారికంగా కూడా ప్రకటించారు. కానీ అనూహ్యంగా వీళ్ళిద్దరూ ఈ చిత్రం నుంచి తప్పుకున్నారట.
కాజల్ అగర్వాల్, నిత్యామీనన్ ఇద్దరూ సినిమానుంచి తప్పుకోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఎవరైనా ఒక్క హీరోయిన్ మాత్రమే ఈ చిత్రం నుంచివైదొలిగి ఉంటె వ్యక్తిగత కారణాలు అనుకుని ఉండొచ్చు. కానీ ఇద్దరూ ఒకేసారి తప్పుకోవడంతో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నిర్మాతలకు హీరోయిన్లకు పారితోషకం విషయంలో చెడిందా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. డేట్స్ అడ్జెస్ట్ చేయలేక పోయి ఉండొచ్చు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.
కాజల్, నిత్యామీనన్ ఇద్దరూ తప్పుకోవడంతో చిత్ర యూనిట్ వేరే హీరోయిన్లని వెతుక్కునే పనిలో పడింది. కాగా నిత్యామీనన్ స్థానంలో హలో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ ని సెలెక్ట్ చేసుకున్నారట. మరొక హీరోయిన్ ని ఎంపిక చేసుకోవలసి ఉంది.
శర్వానంద్ ఈ చిత్రంలో డాన్ పాత్రలో కనిపించబోతున్నాడు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. స్వామిరారా చిత్రంతో విజయాన్ని అందుకున్న సుదీర్ వర్మ ఆ తరువాత దోచెయ్, కేశవ వంటి చిత్రాలని తెరకెక్కించారు.