Pawan Kalyan Has Proposed Fact Finding Committee

2018-02-10 1

The Jana Sena chief Pawan Kalyan has proposed to form fact finding committee on Andhra Pradesh issues.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేసిన సహాయంపై బిజెపి ఎంపీ హరిబాబు వివరించగా, తనకు న్యాయం చేయాలని టిడిపి ఎంపీలు అరుణ్ జైట్లీని కలిశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు. తదుపరి కార్యాచరణపై ఆయన దృష్టి పెట్టిన్లు కనిపిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిసినప్పటికీ వేడి చల్లారినట్లు లేదు.
విభజన హామీలపై సంయుక్త నిజనిర్ధారణ ఏర్పాటు చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. ట్వీట్టర్‌లో ఆయన ఈ మేరకు ఓ ప్రతిపాదన చేసారు. ఆర్థిక వేత్తలు, మాజీ ప్రభుత్వాధికారులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్లలు, రాజకీయ నాయకులు ఇందులో ఉండాలని ఆయన అన్నారు. దాంతో పాటు కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న అంశాలపై విస్తృత చర్చను చేపట్టాలని ఆయన సూచించారు.
కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై గానీ, ఇతర అంశాలపై బిజెపి నాయకులు తప్పుడు లెక్కలు చెప్తే తిప్పికొట్టాలని చంద్రబాబు తమ పార్టీ ఎంపీలకు, నాయకులకు సూచించారు. కేంద్రంలోని పరిణామాలను ఆయన నిశితంగా పరిశీలిస్తున్నారు. కేంద్రంలో కదలిక వచ్చినందున మార్చి 5వ తేదీ వరకు వేచి చూడాలనే వైఖరిని ఆయన తీసుకున్నారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడ్ని ఢిల్లీకి పంపించాలని నిర్ణయించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసే జెఎసికి సహరిస్తామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు రఘువీరారెడ్డ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్టీలకు అతీతంగా పోరాడాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం చాలా తక్కువ నిధులు ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెసు తరఫున చేపట్టబోయే ఆందోళనా కార్యక్రమాలను కూడా ఆయన ప్రకటించారు.

Free Traffic Exchange