Bigg Boss Telugu Season 2 waiting for NTR

2018-02-10 1,819

Young tiger NTR is getting ready with Biggboss2. This show will be 100 days for second season. Meanwhile NTR is preparing for Trivikram and Rajamouli movies

గతేడాది వరుస విజయాలతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూసుకెళ్లాడు. సినిమాలతోనే కాకుండా బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షోతో ఆకట్టుకొన్నాడు. వెండితెర ప్రేక్షకులకే కాకుండా బుల్లితెర ప్రేక్షకులకు కూడా చేరవయ్యాడు. బిగ్‌బాస్‌తో ప్రతీ ఇంటికి దగ్గరయ్యాడు. బిగ్‌బాస్ సీజన్ 2కు సంబంధించిన విషయాలు తాజాగా కొన్ని వెలుగులోకి వచ్చాయి. అవేమింటంటే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో బిగ్‌బాస్ రెండో సీజన్ చేసేందుకు స్టార్ మా టీవీ ఛానల్ నిర్వాహకులు రెడీ అవుతున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్‌తో ఈ షోకు సంబంధించిన చర్చలు, తేదీల ఖరారుపై కసరత్తు చేస్తున్నారట.
బిగ్‌బాస్ తెలుగు తొలి సీజన్ కార్యక్రమం 70 రోజులపాటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. ఫస్ట్ సీజన్‌కు వచ్చిన రెస్పాన్స్‌ను దృష్టిలో పెట్టుకొని రెండో సీజన్‌ను 100 రోజులుపాటు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.
బిగ్‌బాస్ తొలి సీజన్‌ విశేష స్పందన రావడంతో చానెల్ టీఆర్పీ రేటింగ్ రికార్డు స్థాయిలో నమోదైంది. రెండో సీజన్ ఎక్కువ రోజులు కొనసాగించి టీఆర్పీ రేటింగ్ కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.
జై లవకుశ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్‌తో సినిమాపై దృష్టిపెట్టారు. ఈ చిత్రం మార్చిలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. అక్టోబర్‌లో రాజమౌళి రూపొందించే మల్టీస్టారర్‌లో రాంచరణ్‌తో కలిసి నటించనున్నారు.