Undavalli Responds on Pawan Kalyan 'JAC' step

2018-02-09 2,143

Congress MP Undavalli Arun Kumar will meet Jana Sena chief Pawan Kalyan soon ahead of JAC . Jana Sena Party chief Pawan Kalyan has called upon all stakeholders to join hands and form a joint action committee (JAC) to demand “justice” for the state.


కేంద్రం విభజన హామీలు నెరవేర్చేలా ఒత్తిడి తెచ్చేందుకు జేఏసీని ఏర్పాటు చేస్తామని, ఉండవల్లి అరుణ్ కుమార్, జయప్రకాశ్ నారాయణ వంటి వారితో కలిసి వెళ్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. దీనిపై ఉండవల్లి స్పందించారు. తాను ఎప్పుడో రాజకీయాల నుంచి ప్యాకప్ చెప్పిన ఆర్టిస్టును అని చెప్పారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్లీ వచ్చి యాక్షన్ అని అంటున్నాడని చెప్పారు. ఆయన తన మనసులో ఏమనుకుంటున్నారో ఇంకా తనకు తెలియదని చెప్పారు.
తాము కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడుకున్నామని ఉండవల్లి చెప్పారు. ఆ రెండు నిమిషాల్లో కూడా తాను.. తాను ఏమీ మేధావిని కాదని, తన పేరు ఎవరు చెప్పారో తెలియదని పవన్ కళ్యాణ్‌తో చెప్పానని వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ తన వద్దకు వస్తానని చెబితే వద్దని తానే చెప్పానని ఉండవల్లి అన్నారు. పవన్ రాజమండ్రికి వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుందని అందువల్ల తానే హైదరాబాద్ వస్తానని చెప్పానని తెలిపారు. త్వరలో హైదరాబాదుకు వెళ్లి పవన్‌ను కలిసి అన్ని విషయాలు చర్చిస్తానని తెలిపారు.
తనలో పవన్ కళ్యాణ్ ఏం చూశారో తెలుసుకోవాల్సి ఉందని ఉండవల్లి చెప్పారు. లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ వంటి నేతలు పవన్ వెంట నడిస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఉండవల్లి అన్నారు.
కాగా, టీడీపీలో విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే దిశగా సమష్టిగా ముందుకు వెళ్తున్నట్లు జేపీ, పవన్ కళ్యాణ్ గురువారం చెప్పిన విషయం తెలిసిందే. ఏపీకి, తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీలపై పోరాడేందుకు మేధవులతో కలిసి నడుస్తానని పవన్ చెప్పారు