Chandrababu's Cash for Vote Case : There is Nothing wrong with it

2018-02-09 1,989

Former MP Undavalli Arun Kumar suggestion to Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu.


ఇరవై ఏళ్ల క్రితం స్వర్గీయ నందమూరి తారక రామారావును గద్దె దింపినప్పుడు వైస్రాయ్ హోటల్ వేదికగా రాజకీయాలు నడిపిన చంద్రబాబు, అలాంటి ధైర్యంలో ఇప్పుడు పదోవంతు చూపినా నరేంద్ర మోడీ ప్రభుత్వం పడిపోతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఓ టీవీ ఛానల్ లైవ్‌లో శుక్రవారం మాట్లాడారు. పార్లమెంటులో బీజేపీకి పూర్తిగా బలం లేదన్నారు. ఇప్పటికే శత్రఘ్నుసిన్హా, యశ్వంత్ సిన్హా వంటి వారు దూరమయ్యారని, వారు గ్రూపులు పెట్టుకున్నారని చెప్పారు. శివసేన వంటి పార్టీలి బీజేపీకి దూరమయ్యాయన్నారు.
రాజస్థాన్ ఉప ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత చాలామందికి ప్రధాని మోడీపై నమ్మకం పోయిందని ఉండవల్లి చెప్పారు. బీజేపీలో సీనియర్ల గ్రూపులు, శివసేన దూరం కావడం చూస్తుంటే బీజేపీకి పార్లమెంటులో బలం లేదని తేలిపోతుందన్నారు. ఏపీకి డిమాండ్లు సాధించుకునే క్రమంలో మరింత ఒత్తిడి తీసుకు రావాడానికి ఇదే సరైన సమయమని చెప్పారు.
రాజస్థాన్‌లో రెండు సిట్టింగ్ ఎంపీ స్థానాలను బీజేపీ కోల్పోయిందని ఉండవల్లి గుర్తు చేశారు. బీజేపీ ముందస్తు ఎన్నికల ఆలోచనకు కూడా దూరమైందన్నారు. గతంలో ముందస్తుకు ఉత్సాహం చూపిందని, ఇప్పుడు అలాంటి ఆలోచన చేయడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు తన ముందు ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.
చంద్రబాబు వెంటనే ఎన్డీయే భాగస్వామిగా తప్పుకొని, కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలతో రాజీనామా చేయించాలని ఉండవల్లి సూచించారు. నాడు రాష్ట్ర విభజన సమయంలో తప్పంతా కాంగ్రెస్‌దేని మోడీ చెబుతున్నారని, మరి ఈ మూడున్నరేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు.