Sai Dharam Tej Responds On Love Affair With Regina

2018-02-09 1

In an Interview First Time Sai Dharam Tej responds on Love affair with Regina ahead of Intelligent release

నాలుగు వరుస ఫ్లాప్‌ల తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రం ఇంటిలిజెంట్. జవాన్ చిత్రం ఆశించినంత మేరకు బాక్సాఫీస్ వద్ద స్పందన కనిపించలేదు. ఈ నేపథ్యంలో వీవీ వినాయక్, సీ కల్యాణ్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రంతో సాయి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ మీడియాతో మాట్లాడారు.. సాయిధరమ్ తేజ్ వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..
ఇంటిలిజెంట్ చిత్రంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పాత్రను పోషిస్తున్నాను. పాత్ర స్వభావరీత్యా చిన్నతనం నుంచి నేను ఓ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రాలేని వ్యక్తిని. కొన్ని పరిస్థితుల కారణంగా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, టీచర్లు వలన నేను ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాల్సి వస్తుంది. నా ఇంటిలిజెన్స్‌తో నేను ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాను అనేది ప్రధాన కథ.
కథలో గానీ కొత్త పాయింట్ ఏమీ లేదు. క్యారెక్టర్ కొత్తగా ఉండదు. సినిమా మొత్తం ఓ కమర్షియల్‌గా ఉంటుంది ఇంటిలిజెంట్. ప్రతీ ఒక్కరు ఎంటర్‌టైన్ అవుతారనే నమ్మకం ఉంది. సక్సెస్ అవుతుందనే ప్రతీ సినిమాను చేస్తాం. హిట్ అవుతుందా? లేదా అనేది ప్రేక్షకులు నిర్ధారిస్తారు.
వరుసగా నాలుగు ఫ్లాప్ రావడం వెనుక కారణాలు ఆలోచించాను. ఆ తర్వాతనే వినాయక్‌తో ఇంటిలిజెన్స్ చేశాను. కథ, కథనాలు సరిగ్గా వర్కవుట్ కాలేదు. కథలు మాకు నచ్చాయి గానీ ప్రేక్షకులకు నచ్చేలా తీయలేకపోవడం మా వైఫల్యం. ఇందులో ఎవరినీ తప్పు పట్టలేం. సినిమా అనేది టీమ్ వర్క్.